ఒక్క రోజు తేడాతో రెండు పరీక్షలు: రీచా గంగోపాద్యాయ
రవితేజతో నటించిన 'మిరపకాయ్" చిత్రం తర్వాత తెలుగు తెరకు దూరమై తమిళ తెరకు దగ్గరైన బెంగాళీ భామ రిచా గంగోపాధ్యాయ. ఈ సుందరాంగి ప్రస్తుతం తమిళంలో శింబుతో 'దబాంగ్" రీమేక్ 'ఓస్తీ" చిత్రంలో, అలాగే ధనుష్ కథానాయకుడిగా సెల్వరాఘవన్ తెరకెక్కిస్తున్న 'మయక్కమ్ ఎన్న" చిత్రంలోనూ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ రెండు చిత్రాల్లో 'ఓస్తీ" ఈ నెల 24న విడుదలవుతుండగా, 'మయక్కమ్ ఎన్న" ఒక్కరోజు తేడాతో ఈ నెల 25న విడుదలవుతోంది.
ఈ సందర్భంగా రిచా మాట్లాడుతూ ' తమిళంలో నేను నటించిన 'ఓస్తీ", మయక్కమ్ ఎన్న" ఈ రెండు చిత్రాలు ఒక్క రోజు తేడాతో విడుదలవుతుండటం ఓ పక్క ఆనందంగానూ, ఒకింత కంగారు గానూ వుంది. ఎందుకంటే ఈ రెండింటిలో ఏ చిత్రం విజయం సాధిస్తుందో , ఏది ప్రేక్షకులని నిరుత్సాహపరుస్తుందో అని కంగారుగా వుంది. నావరకైతే ఈ రెండు చిత్రాలు ప్రేక్షకులని అలరిస్తాయన్న నమ్మకముంది" అంటోంది. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న చిత్రంతో మరోసారి టాలీవుడ్ లో రిచా గంగోపాధ్యాయ తన అదృష్టాన్ని పరీక్షంచుకోనున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











