ఆర్య 2 లోని 'రింగా రింగా' పాటకి అక్కడా డిమాండ్
జల్సా, శంకర్ దాదా ఎంబీబియస్ లో నా పాటలు విని ఓ తమిళ దర్శకుడు పిలిచి తమ తమిళ చిత్రంలో పెట్టమని అన్నారు. మంచి లిరిక్స్ తో ఆ ట్యూన్స్ ని తమిళంలో చేసి రిలీజ్ చేసాం. విజయ్ హీరోగా చేసిన విల్లు చిత్రంలో ఆ పాటలు ఉన్నాయి. అక్కడ కూడా ఈ పాటలు పెద్ద హిట్టయ్యాయి అంటున్నారు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్. అలాగే నా రింగ రింగా సాంగ్ కి కూడా మంచి డిమాండ్ తమిళంలో ఉంది అన్నారాయన. అలాగే బొమ్మాళి(భిళ్ళా), ఆకలేస్తే అన్నం పెడతా పాటలు ఇప్పుడు తమిళనాట మారు మ్రోగుతున్నాయి. విజయ్ హీరోగా చేసిన సుర చిత్రంలో వాటిని వాడారని తెలుస్తోంది. అలాగే గోదావరి చిత్రం కోసం రాధాకృష్ణ అందించిన ట్యూన్స్ కోసం కూడా తమిళంలో డిమాండ్ ఉందని చెప్తున్నారు.
ఆర్య 2 దేవిశ్రీ ప్రసాద్ సుకుమార్ శంకర్ దాదా ఎంబిబిస్ గోదావరి రాధాకృష్ణ arya2 devisri prasad sukumar sura godavari


Click it and Unblock the Notifications