మాస్టర్ సినిమా చూడకుండానే వెళ్లున్నా.. షాకింగ్‌గా విజయ్ అభిమాని సూసైడ్!

తమిళ సూపర్ స్టార్, దళపతి విజయ్‌ని తన ప్రాణం కంటే మిన్నగా ప్రేమించే అభిమాని ఆత్మహత్య చేసుకోవడం తమిళనాడులో సంచలనం రేపింది. విజయ్‌కి వీరాభిమాని అయిన బాలా సూసైడ్ చేసుకోవడం అందర్నీ ఆవేదన గురిచేస్తున్నది. మరణానికి ముందు బాలా చేసిన ట్వీట్లు మీడియాలో సెన్సేషన్‌గా, సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రస్తుతం RIPbala హ్యాష్‌ట్యాగ్ దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతున్నది. ఇంతకు బాలా మరణానికి కారణాలు ఏమిటంటే..

విజయ్, ధోని, రైనాకు వీర ఫ్యాన్

విజయ్, ధోని, రైనాకు వీర ఫ్యాన్

బాలా ట్విట్టర్ అకౌంట్ పరిశీలిస్తే.. అతను విజయ్, ధోని, రైనా, మ్యూజిక్ డైరెక్టర్ యువన్‌కు వీరాభిమాని. అతడి ట్విట్టర్ ఐడీ @AlwaysLonely07. మరణానికి ముందు తీవ్ర డిప్రెషన్‌లో ఉన్నట్టు తెలుస్తున్నది. తన మరణానికి ముందు ప్రతీ ఒక్కరు నన్ను అసహ్యించుకొంటున్నారు అంటూ ట్వీట్ చేశారు. ఆ తర్వత మరణించడంతో నెటిజన్లు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

మరణానికి ముందు వరుస ట్వీట్లు

మరణానికి ముందు వరుస ట్వీట్లు


బాలా తన ట్విట్టర్ అకౌంట్ నుంచి వరుస ట్వీట్లు చేశారు. ఒంటరితనంతో బాధపడుతున్నాను. ఇలాంటి దుర్బర జీవితం నాకు అవసరమా?, నాకంటూ ఎవరూలేని ఈ లోకంలో ఉండటం అవసరమా అంటూ బాలా వరుస ట్వీట్లు చేశారు. అనంతరం బాలా ఆగస్టు 13వ తేదీన సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ప్రాణాలు తీసుకొన్నాడు.

మాస్టర్ సినిమాను చూడకుండానే వెళ్తున్నా

మాస్టర్ సినిమాను చూడకుండానే వెళ్తున్నా

తాను మరణించడానికి ముందు బాలా రాసిన సూసైడ్ నోట్ ప్రతీ ఒక్కరిని కలిచి వేసేలా చేసింది. తలైవా విజయ్ నటించిన మాస్టర్ చూడకుండానే ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నాను. ఆ సినిమా చూడాలనే కోరిక తీరడం లేదు అని లేఖలో పేర్కొన్నారు. ఏప్రిల్‌లో రిలీజ్ కావాల్సిన మాస్టర్ చిత్రం కోవిడ్ 19 కారణంగా విడుదల నిలిచిపోయిన విషయం తెలిసిందే.

Recommended Video

Happy Birthday Vijay : Thalapathy Vijay Box Office Career
విజయ్‌కి వార్తను చేరవేయండి

విజయ్‌కి వార్తను చేరవేయండి

విజయ్ అభిమాని బాలా మరణించిన నేపథ్యంలో ట్విట్టర్‌లో అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. బాలా మరణం తమను విషాదంలో ముంచెత్తింది. బాలా మరణ వార్తను హీరో విజయ్‌కి తెలియ చేయండి అంటూ ట్వీట్లు చేస్తున్నారు. అయితే బాలా మరణానికి అసలు కారణం ఏమిటో తెలియాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X