twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విజయ్ ఫ్యాన్ సూసైడ్‌‌ మిస్టరీ.. పోలీసులు రంగంలోకి.. బాలా ఫ్యామిలీకి దళపతి ఫోన్

    |

    తమిళ సూపర్‌స్టార్ విజయ్ వీరాభిమాని బాలమురుగన్ అలియాస్ బాలా వ్యక్తిగత కారణాలతో సూసైడ్ చేసుకోవడం కోలివుడ్‌లో సంచలనం రేపింది. బాలా మరణం గురించి హీరో విజయ్‌కి తెలియజేయండి అంటూ ట్వీట్లు వైరల్ అయ్యాయి. దాంతో విజయ్ పీఆర్‌వో, ఇతర సిబ్బంది అభిమాని మరణవార్తను విజయ్ చేరవేశారు. అభిమాని విషాద విషయాన్ని తెలుసుకొన్న విజయ్ వెంటనే స్పందించినట్టు తెలిసింది. బాలా మరణానికి కారణాలు ఏమిటనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాలా గురించి విజయ్ ఏం చేశారంటే..

    విజయ్ ఫ్యాన్ సూసైడ్

    విజయ్ ఫ్యాన్ సూసైడ్


    ఆగస్టు 13వ తేదీన బాలా తన మరణానికి ముందు తనను అందరూ అసహ్యించుకొంటున్నారు. అందుకే ఈ లోకం విడిచి వెళ్తున్నాను అని సూసైడ్ నోట్‌లో పేర్కొనడం అందర్నీ కలిచి వేసింది. తనకు అత్యంత ఇష్టమైన హీరో విజయ్ నటించిన మాస్టర్ సినిమాను చూడకుండానే తిరిగి రాని లోకాలకు వెళ్తున్నాను అంటూ ట్వీట్ చేయడం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

    బాలా కుటుంబానికి విజయ్ పరామర్శ

    బాలా కుటుంబానికి విజయ్ పరామర్శ

    బాలా మరణంతో పుట్టెడు దు:ఖంలో ఉన్న కుటుంబానికి విజయ్ ఫోన్‌లో చేసి వారిని పరామర్శించినట్టు తెలిసింది. కోలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం.. బాలా తల్లి మలర్విజి, కుటుంబ సభ్యులతో విజయ్ స్వయంగా మాట్లాడారు. వారిని ఆదుకొంటానని చెప్పారు. బాలా మరణంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కల్లకురిచి ప్రాంతంలోని ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడితో మాట్లాడి తగిన సహాయం అందించే ప్రయత్నాలు చేస్తున్నారు అని తెలిసింది.

    విజయ్ ఫ్యాన్‌ మరణంపై పోలీసుల ఆరా

    విజయ్ ఫ్యాన్‌ మరణంపై పోలీసుల ఆరా

    తన మరణానికి లవ్ ఫెయిల్యూర్ కారణం కాదు. కుటుంబ సమస్యలే కారణం. నన్నంతా అసహ్యించుకొంటున్నారు అని ట్వీట్ చేసి ఆత్మహత్య చేసుకోవడం వివాదంగా మారింది. బాలా మరణం వెనుక కారణాలు ఏమిటనే విషయంపై పోలీసులు దృష్టిపెట్టారు. సోషల్ మీడియాలో #RIPBala అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ కావడంతో బాలా మరణానికి బలమైన కారణమేమిటనే విషయంపై పలువురిని ప్రశ్నిస్తున్నారు.

    Recommended Video

    Happy Birthday Vijay : Thalapathy Vijay Box Office Career
    సివిల్ ఇంజినీరింగ్ చేసి చెన్నైలో ఉద్యోగం

    సివిల్ ఇంజినీరింగ్ చేసి చెన్నైలో ఉద్యోగం


    బాలా సివిల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ పూర్తి చేసి చెన్నైలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. లాక్‌డౌన్ కారణంగా ఉద్యోగం పోవడంతో తన స్వగ్రామానికి తిరిగి వచ్చి కుటుంబంతోనే ఉంటున్నారు. నిరుద్యోగంతో బాధపడుతున్న బాలా డిప్రెషన్‌కు గురయ్యాడని, ఆ కారణంగానే ఆత్మహత్య చేసుకొన్నాడనే విషయం ప్రాథమికంగా బయటకు వచ్చింది. బాలా మరణం విజయ్ అభిమానులు తీవ్ర విషాదంలోకి నెట్టింది. బాలా మరణాన్ని జీర్ణించుకోలేక అభిమానులు ట్వీట్లతో సంతాపం వ్యక్తం చేయడంతో దేశవ్యాప్తంగా #RIPBala ట్రెండ్ అయింది.

    English summary
    Thalapathy Vijay fan reportedly died by suicide on August 13th in Chennai. His last tweet was very heart touching. He says leaving in the world without watching upcoming his favorite hero actorvijay movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X