యువ హీరోయిన్ మృతి: రంగంలోకి పోలీసులు.. మరణానికి కారణాలు ఇవే!

తమిళ పరిశ్రమకు చెందిన యువ నటి రియామిక ఆత్మహత్య కోలీవుడ్ ప్రముఖులను దిగ్బ్రాంతికి గురిచేసింది. ఎంతో భవిష్యత్ ఉన్న నటి జీవితం అలా అర్ధాంతరంగా ముగియడంపై పలువురు షాక్ గురయ్యారు. ఆమె మృతిపట్ల సానుభూతిని సోషల్ మీడియాలో వ్యక్తం చేశారు. అయితే ఆమె మరణానికి వెనుక ఉన్న బలమైన కారణాలు వెలుగులోకి వచ్చాయి. వివరాల్లోకి వెళితే..

బాయ్‌ఫ్రెండ్ ఫోన్‌కాల్స్‌తో

బాయ్‌ఫ్రెండ్ ఫోన్‌కాల్స్‌తో

కోలీవుడ్‌లో అఘోరియాన్ అట్టం, ఎక్స్‌వీడియోస్ అనే చిత్రాల్లో నటించి ప్రేక్షకులను, సినీ వర్గాలను ఆకట్టుకొన్నది. గత కొద్దికాలంగా చెన్నై నగరంలోని వలసరవక్కమ్‌లోని శ్రీదేవి కుప్పుంలో తన కజిన్‌ ప్రకాష్‌తో కలిసి ఉంటున్నారు. తన బాయ్ ఫ్రెండ్ దినేష్ ఎన్నిసార్లు ఫోన్‌కాల్ చేసినప్పటికీ బదులు ఇవ్వకపోవడంతో అనుమానం పెరిగింది.

బాయ్‌ఫ్రెండ్‌ కళ్లముందు విగతజీవిగా

బాయ్‌ఫ్రెండ్‌ కళ్లముందు విగతజీవిగా

రియామిక్క పరిస్థితిపై ఆందోళన చెందిన దినేష్ వెంటనే శ్రీదేవి కుప్పంలోని తన నివాసానికి వచ్చాడు. డోర్ బెల్ కొట్టినా తీయకపోవడంతో తలుపులు పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. అప్పటికే రియామిక విగతజీవిగా మారింది. ఆ తర్వాత పోస్ట్ మార్టం కోసం రోయపెట్ట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

కొద్దికాలంగా డిప్రెషన్‌లోకి

కొద్దికాలంగా డిప్రెషన్‌లోకి

కోలీవుడ్‌లో అవకాశాలు రాకపోవడంతో కొన్ని రోజులుగా రియామిక డిప్రెషన్‌కు గురైంది. అప్పటి నుంచి అదోలా వ్యవహరిస్తున్నట్టు తెలిసింది. ఇంట్లో కజిన్ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొన్నారు. అంతకు మించి ఇతరత్రా కారణాలు లేవు అని పోలీసులు పేర్కొన్నారు.

కేసు నమోదు.. దర్యాపులో పోలీసులు

కేసు నమోదు.. దర్యాపులో పోలీసులు

రియామిక అసహజమా మరణంపై వలసరవక్కమ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 174 (అసహజ మరణం) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రియామిక మరణం వెనుక మరేమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నట్టు తెలిసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X