నటి, ఎమ్మెల్యే రోజా భర్తకు కూడా పదవి దక్కిందోచ్!

Recommended Video

RK Selvamani Elected As Tamil Directors Union President || Filmibeat Telugu

సినీ నటి, ఏపీ ఎమ్మెల్యే రోజాకు ఇప్పుడంతా మంచి రోజులే నడుస్తున్నట్లు ఉన్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆమె ప్రాతినిధ్యం వహించిన వైఎస్ఆర్‌సీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఇంతకాలం పార్టీ కోసం కష్టపడి పని చేసిన ఆమెకు ఏపీఐసీసీ చైర్మన్ పదవి దక్కింది. రాబోయేకాలంలో రోజాకు మంత్రి పదవి దక్కే అవకాశం ఉందనే వార్తలు సైతం వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే... రోజా భర్త ఆర్కే సెల్వమణికి కూడా పదవి దక్కింది. ఆయన రాజకీయాల్లో లేరు కదా? ఆయనకు ఏం పదవి అనుకుంటున్నారా? మీ సందేహం నిజమే, ఆయనకు దక్కింది రాజకీయ రంగానికి చెందిన పదవి కాదు, సినిమా రంగానికి చెందిన పదవి.

హోరా హోరీగా జరిగిన ఎన్నికలు

హోరా హోరీగా జరిగిన ఎన్నికలు

తమిళ సినీ దర్శకుల సంఘం అధ్యక్షుడిగా సెల్వమణి ఎన్నికయ్యారు. పొలిటికల్ ఎలక్షన్ తరహాలో హోరా హోరీగా జరిగిన ఈ పోరులో సెల్వమణి భారీ మెజారిటీతో విజయం సాధించారు. అయితే ఈ ఎన్నికల ముందు భారీ హైడ్రామా చోటు చేసుకోవడంతో విజయం ఎవరిని వరిస్తుందనే ఉత్కంఠ మధ్య సెల్వమణి తన సత్తా చాటారు.

ఎన్నికల అనివార్యమైన వేళ

ఎన్నికల అనివార్యమైన వేళ

జూన్ నెలలో జరిగిన తమిళ దర్శకుల సమావేశంలో భారతీరాజాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అయితే ఈ ఏకగ్రీవ ఎన్నికపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేయడంతో భారతీరాజా తప్పుకున్నారు. దీంతో ఎన్నికలు నిర్వహించకతప్పలేదు. ఈ ఎన్నికల్లో సెల్వమణి మరో దర్శకుడు విద్యాసాగర్‌తో పోటీ పడ్డారు.

భారీ మెజారిటీ

భారీ మెజారిటీ

తమిళ దర్శకుల సంఘంలో మొత్తం 1,900 మంది సభ్యులు ఉండగా 1503 మంది ఓటింగులో పాల్గొన్నారు. ఇందులో ఆర్‌కే.సెల్వమణి 1,386 ఓట్ల మెజారిటీ సాధించడం విశేషం. తనను ఇంత భారీ మెజారిటీతో గెలిపించిన సభ్యులకు ఈ సందర్భంగా సెల్వమణి కృతజ్ఞతలు తెలిపారు. ఉపాధ్యక్షుడిగా దర్శకుడిగా ఎననికైన కే ఎస్‌.రవికుమార్‌ 1,489 ఓట్లు సాధించారు.

రోజా, సెల్వమణి

రోజా, సెల్వమణి

రోజా, సెల్వమణి వివాహం ఆగస్టు 10, 2002లో జరింగింది. అప్పటి నుంచి వీరు అన్యోన్య దాంపత్యం సాగిస్తున్నారు. వీరికి ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. సెల్వమణి తమిళనాడలో ఉంటూ తన వృత్తిని కొనసాగిస్తుండగా... రోజా ఏపీ రాజకీయాల్లో కొనసాగుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X