నటి ఇంట్లో దొంగతనం, హత్య
తమిళ నటి విచిత్ర ఇంటిపై దొంగలు దాడి చేసారు. ఆమె తండ్రి విలియమ్స్, వసంతి ఇంట్లో ఉన్న సమయంలో దొంగలు వచ్చారు. చెన్నైకు దగ్గరలో ఉన్న ఫామ్ హౌస్ లో ఉన్న ఇంట్లో ఇది జరిగింది. అయితే ఉదయానికి కానీ ఇది తెలియరాలేదు. ఆ సమయంలో ఆమె ఇంట్లో లేదు. ఇక ఈ దాడిలో ఆమె తండ్రి హత్యకు గురి అయ్యారు. ఆమె తల్లకి తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను హాస్పటిల్ లో జాయిన్ చేసారు. పోలీస్ లు రంగంలో దిగి అనుమానితులు లిస్ట్ తయారు చేస్తున్నారు. ఇక రెండు రోజుల ముందే రెక్కీ జరిపి మరీ దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాధమిక ధర్యాప్తులో తేల్చా రు. ఇక విచిత్ర తలై వాసల్, ఎంగ ముదల్లై, పెరియ కుటుంబం వంటి చిత్రాల్లో నటించింది. ఇప్పుడు కొన్ని టీవీ సీరియల్స్ నటిస్తోంది.


Click it and Unblock the Notifications











