»   » 'రోబో 2.0' ఫస్ట్ లుక్ పంక్షన్ లైవ్ ఇక్కడ (లింక్), అక్షయ్ తో కొత్త పోస్టర్ (ఫొటోలు)

'రోబో 2.0' ఫస్ట్ లుక్ పంక్షన్ లైవ్ ఇక్కడ (లింక్), అక్షయ్ తో కొత్త పోస్టర్ (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా భారీ చిత్రాల దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న చిత్రం '2.0'. ఈ చిత్రం అఫీషియల్ ఫస్ట్ లుక్ ఈ రోజు (నవంబర్ 20న) విడుదల చేస్తున్నారు. ఇందుకోసం ముంబైలో గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఆ పంక్షన్ సాయింత్రం ఐదు గంటలకు గ్రాండ్ గా మొదలైంది. ఈ పంక్షన్ లైవ్ ని మీరు ఇక్కడ చూడవచ్చు. అలాగే ఫంక్షన్ కు చెందిన కొన్ని ఫొటోలను కూడా చూడవచ్చు.

ఇక ఈ పంక్షన్ కు "రోబో 2.0" యూనిట్ ఇన్విటేషన్స్ కూడా రెడీ చేసారు. ఈ ఇన్విటేషన్స్ ని ఇండస్ట్రీలోని ప్రముఖులకు అందచేసారు. ఆ ఇన్విటేషన్ కార్డులు చూసిన వారు ..ఇదో ట్రెండ్ అవుతుందేమో..పెద్ద సినిమాలు అన్నిటికి అంటున్నారు. ఈ లోగా సినిమాలో అక్షయ్ కుమార్ లుక్ తో పోస్టర్ ని విడుదల చేసారు. దాన్ని మీరు ఇక్కడ చూడవచ్చు.

ప్రముఖలను ఇన్వైట్ చేసేందుకే

ప్రముఖలను ఇన్వైట్ చేసేందుకే

సూపర్ స్టార్ రజనీకాంత్ నటిసున్న "2.0" కి శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు, ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ ఫంక్షన్స్ ని ముంబైలోని ప్రముఖ నిర్మాణ సంస్థ "యష్ రాజ్" సూడియోలో భారీ స్థాయిలో నిర్వహిస్తున్నారు, దాని కోసం ప్రముఖులను ఇన్వేట్ చేయటానికి రూపొందించిన కార్డు ఇప్పుడు చర్చనీయాంశమైంది.

భారీగా

భారీగా

రోబో బాడిలా..ఈ కార్డ్ చూస్తూంటే... సినిమా యొక్క భారీతనం చెప్పకనే చెపుతుంది, మొదటి పేజీలో రోబో బాడీలా వుండే డిజైన్ మధ్యలో ఒక పేజీలో ఫంక్షన్ జరిగే ప్లేస్ అండ్ టైమ్ గురించి రాసుకొచ్చారు. ఏదో ఆడియో పంక్షన్ కు ఇలా చేసారంటే అర్దం ఉంది. రిలీజ్ కు కూడా ఈ స్దాయిలోనా అంటున్నారు అంతా.

మనుషుల కోసం మాత్రమే కాదు

మనుషుల కోసం మాత్రమే కాదు

ఈ ఇన్విటేషన్ మరో పేజీలో సినిమా లుక్ చివరి పేజీలో నిర్మాణ సంస్థ లోగోతో పాటుగా "ఈ ప్రపంచం కేవలం మనుషుల కోసమే కాదు" అని అర్థం వచ్చే పదాలతో డిజైన్ చేశారు. ఆ డిజైన్ చూస్తూంటే స్టోరీ లైన్ కొంతవరకూ అర్దమవుతోంది అంటున్నారు.

వామ్మో అంత ఖర్చు పెడతారా

వామ్మో అంత ఖర్చు పెడతారా

ఇప్పటికే ఈ సినిమాని 360 కోట్ల భారీ ఖరుతో నిర్మించారు, అలాగే ఈ సినిమా ప్రమోషన్స్ కోసం దాదాపుగా 40 కోట్లు వరకూ ఖర్చు చేయనున్నారు. 40 కోట్లు అంటే తెలుగులో ఓ పెద్ద హీరో సినిమా బడ్జెట్ అంత అన్నమాట. ఈ ప్రమోషన్ బడ్జెట్ విని అంతా షాక్ అవుతున్నారు.

డబ్బు కొద్దీ ప్రమోషన్

డబ్బు కొద్దీ ప్రమోషన్

ఈ ప్రమోషన్స్ కోసం దర్శకుడు శంకర్ యీనిట్ దగ్గర పక్క ప్లాన్ సిద్ధంగా వందని సమాచారం, ఈ సినిమాని "లైకా సంస్థ నిర్మిస్తుంది. "పిండి కొద్దీ రొట్టె' అనేలా సినిమా బడ్జెట్ ని బట్టీ ప్రమోషన్స్ అందులో తప్పేమి లేదులే అంటున్నారు సీనియర్స్.

అదిరింది

అదిరింది

2.0 చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్టర్ రజనీకాంత్‌ ట్విట్టర్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నారు. లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రంలో అమీ జాక్సన్‌ హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్‌ విలన్ పాత్రలో పోషిస్తున్నారు.ఈ ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

ప్రస్దావించరు కానీ..

ప్రస్దావించరు కానీ..

సాధారణంగా సినిమా పోస్టర్లపై విలన్ల పేర్లను ప్రస్తావించరు. కానీ ఈ పోస్టర్లో రజనీతో పాటు అక్షయ్‌కుమార్‌ పేరు కూడా ప్రస్తావించడం గమనార్హం. అంటే విలన్ పాత్రకు సినిమాలో ఎంత ప్రయారిటీ ఇస్తున్నారో అర్దం చేసుకోవచ్చు. ముఖ్యంగా బాలీవుడ్ సూపర్ స్టార్ కావటం అక్షయ్ కుమార్..కలిసివచ్చే అంశం.

అదీ స్కెచ్

అదీ స్కెచ్

ముంబైలో ఫస్ట్ లుక్ కార్యక్రమం ఏర్పాటు చేయడం వెనక ముఖ్య కారణం సినిమాకు నేషనల్ వైడ్ హైప్ తేవడమే అని చెప్తున్నారు. అదే ఎప్పటిలాగ చెన్నైలో చేస్తే అది సౌత్ సినిమా కింద ముద్ర పడుతుందని, ముంబైలో చేస్తే నేషనల్ వైడ్ హైప్ వస్తుందని భావిస్తున్నారు.

బాలీవుడ్ మార్కెట్ కోసం..

బాలీవుడ్ మార్కెట్ కోసం..

‘బాహుబలి'లాగానే ‘రోబో 2.0'ను కూడా బాలీవుడ్‌లో కరణ్‌ జోహారే ప్రమోట్‌ చేస్తున్నాడట. అయితే ‘బాహుబలి-2'తో పోలిస్తే ‘రోబో 2.0'కు ఉండే పెద్ద అడ్వాంటేజ్‌ అక్షయ్‌ కుమార్‌. బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌ ‘రోబో 2.0'లో విలన్‌గా నటిస్తున్నాడు. ప్రమోషన్‌ పరంగా ఈ సినిమాకు అక్షయ్‌ చాలా హెల్ప్‌ అవుతాడు.

అది ప్లస్ అవుతుంది

అది ప్లస్ అవుతుంది

రజనీకాంత్ గత చిత్రం కబాలి కు వచ్చిన క్రేజ్ మామూలుగా లేదు. దాంతో ఖచ్చితంగా రోబో 2 కు కూడా ఆ స్దాయిని మించిన క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు. అదే ఉత్సాహంతో నిర్మాతలు డబ్బుని నీళ్లలా ఖర్చు పెడుతున్నారు. ఈ సినిమా గురించి బాలీవుడ్ లో కూడా చర్చ జరిగే స్దాయికి తీసుకు వెళ్తున్నారు.

20 కోట్లు పెట్టి మరీ..

20 కోట్లు పెట్టి మరీ..

ఈ చిత్రం క్లైమాక్స్ ను చెన్నైలోని చేపాక్ క్రికెట్ స్టేడియంలో చిత్రీకరించారు. ఆర్మీ వాహనం, వెపన్స్ నేపథ్యంలో షూట్ చేశారు. ఇందుకోసం అత్యాధునిక టెక్నాలజీతో కూడిన సెట్‌ వేశారు. ఇందుకోసం రూ.20 కోట్లు ఖర్చు చేసినట్లు కోలీవుడ్ వర్గాల్లో టాక్.

2డి మాత్రమే కాదు..

2డి మాత్రమే కాదు..

ఇక ఈ సినిమాను కేవలం 2డిలో మాత్రమే కాదు.. త్రిడిలో కూడా తెర‌కెక్కిస్తున్నట్లు సమాచారం. 2డితో పాటే 3డిలో కూడా ఈ సినిమా విడుద‌ల కానుంది. అందుకోసమే బడ్జెట్ ని పెంచి, దాదాపు రూ.350కోట్ల బ‌డ్జెట్ తో ఈ సినిమా తెర‌కెక్కుతుంద‌ని టాక్.

గమనించారా

గమనించారా

మీరు ఒకటి గమనించవచ్చు...ఈ చిత్రం కోసం విడుదల చేసిన ప్రీలుక్ పోస్టర్ లో ఎక్కడా రోబో అని రాసిలేదు. '2.0' టైటిల్ ని హైలైట్ చేస్తూ.. దాని క్రింద రజనీ రోబో బొమ్మని వేశారు. ఇలా ఎందుకు చేశారు.. ? రోబో అని ఎందుకు పోస్టర్ పై రాయలేదు అంటే.. ? అనేది తమిళ నాట చర్చనీయాంశంగా మారింది. ఇందుకు రకరకాల కారణాలు చెబుతున్నారు.

భారీ మొత్తం ముట్ట చెప్పాలనే..

భారీ మొత్తం ముట్ట చెప్పాలనే..

ఈ చిత్రం పోస్టర్ పై రోబో అని ఎందుకు రాయలేదు అంటే... రోబో చిత్రానికి దర్శకుడు శంకర్. సూపర్ స్టార్ రజనీ హీరో. నిర్మాత కళానిధి మారన్. ఇప్పుడు తెరకెక్కుతోన్న రోబో సీక్వెల్ కి మాత్రం నిర్మాత కళానిధి మారన్ కాదు. ఈ సీక్వెల్ ని లైకా సంస్థ నిర్మిసోంది. దీంతో టైటిల్ రోబోని వినియోగించుకుంటే.. టైటిల్ వాడుకొన్నారన్న కారణంతో కళానిధి మారన్ కి భారీ మొత్తంలో ముట్టజెప్పాల్సి వస్తుంది. అందుకే.. శంకర్ తన క్రియేటివిటీని అంత ఉపయోగించి.. పోస్టర్ లో రోబో పదం లేకుండా ఇలా డిజైన్ చేయించారని చెబుతున్నారు.

ఆరు కోట్లు అందుకోసమే

ఆరు కోట్లు అందుకోసమే

ఈ రోజు (నంవబర్ 20న) ముంబైలో నిర్వహించనున్న ఫస్ట్ లుక్ ఈవెంట్ కోసం భారీ ఏర్పాట్లని చేస్తున్నట్టు సమాచారమ్.రోబో2 చిత్రబృందం నిర్వహించినున్న ఫస్ట్ ప్రెస్ మీట్ ఇది. ఇందుకోసం దాదాపు రూ. 6కోట్లు ఖర్చు పెట్టబోతున్నారట. ఈ సందర్భంగా రోబో 2 మరో పోస్టర్ ని రిలీజ్ చేస్తారేమోనని రజనీ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

వచ్చే దీపావళికి

వచ్చే దీపావళికి

ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తికావొస్తున్న ఈ చిత్ర్రం పోస్ట్ ప్రొక్షన్ పనుల కోసం దాదాపు 6నెలల సమయం తీసుకోనున్నాడట శంకర్. ఈ చిత్రాన్ని వచ్చే యేదాది దీపావళికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారని తెలుస్తోంది.

అంతకు మించి

అంతకు మించి

దర్శకుడు శంకర్, సూపర్ స్టార్ రజనీల కాంబినేషన్లో వచ్చిన ‘రోబో' చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలుసు. ఇప్పుడు అదే సెన్సేషన్ ను రిపీట్ చేయడానికి శంకర్, రజనీలు ‘రోబో 2.0' అద్భుతాన్ని ఆవిష్కరిస్తున్నారు.

ఒకే ఒకటి ఉంటుందిట

ఒకే ఒకటి ఉంటుందిట

రజనీకాంత్, శంకర్ కాంబినేషన్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయం వెల్లడైంది. ఈ సినిమాలో కేవలం ఒకే ఒక పాట ఉంటుందని చిత్రవర్గాలు వెల్లడించాయి.

ఉక్రెయిన్ లో ..

ఉక్రెయిన్ లో ..

'ఈ సినిమాలో ఒకేఒక పాట ఉంది. చిత్రీకరణ ఇప్పటికే పూర్తయింది. రజనీకాంత్, అమీ జాక్సన్ పై ఈ పాట తీశారు. ఉ్రక్రెయిన్ లోని ప్రముఖ ప్రాంతాల్లో ఈ గీతాన్ని చిత్రీకరించారు. సినిమాలో ఒకే పాట ఉన్నప్పటికీ ఆడియో ఆల్బంలో మాత్రం ఐదు లేదా ఆరు పాటలుంటాయ'ని సన్నిహిత వర్గాలు తెలిపాయి.

వార్నింగ్ ఇచ్చాడు

వార్నింగ్ ఇచ్చాడు

తమ తాజా చిత్రం రోబో 2 గురించి ఎట్టిపరిస్దితుల్లోనూ ఎక్కడా మాట్లాడవద్దని దర్శకుడు శంకర్ తన అసిస్టెంట్స్ కు సీరియస్ గా చెప్పాడట. తమ సినిమాకు సంభంధించిన చిన్న వీడియో కానీ, ఫొటో గానీ లీకైనా వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించాడని సమాచారం.

ఇదే తొలిసారి

ఇదే తొలిసారి

‘రోబో 2'ని 350 కోట్లకి ఇన్సూరెన్స్‌ చేయించారని తెలుస్తోంది! ఇంత భారీ మొత్తాన్ని ఒక సినిమాకు ఖర్చు పెట్టడమే భారతదేశ సినిమా చరిత్రలో మొదటిసారి అనుకుంటే ఇంచుమించు అంత మొత్తాన్ని ఇన్సూరెన్స్‌ చేయడం కూడా మొదటిసారే అంటున్నారు.

English summary
Superstar Rajinikanth's 2.0, directed by Shankar, will have its first look at a grand function in Mumbai on Sunday - November 20. Rajinikanth, Akshay Kumar and director Shankar tweeted about it.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu