కళ్ళు తిరిగే రేంజిలో రజనీకాంత్ 'రోబో' ఆడియో రైట్స్
రజనీకాంత్, శంకర్ ల కాంబినేషన్ లో వస్తున్న రోబో చిత్రం ఆడియో రైట్స్ ఏడు కోట్లకు అమ్ముడయి రికార్డు నమోదు చేసింది.ఎ.ఆర్.రహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో పంక్షన్ జూలై 31 న కౌలాలంపూర్..మలేషియాలో జరగనుంది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హె.బి.ఓ గ్రూప్ వారు ఈ ఆడియో పంక్షన్ ని సమర్పించనున్నారు. ఈ చిత్రం ఆడియో రైట్స్ ని ధింక్ మ్యూజిక్ వారు భారీ పోటీని ఎదుర్కొని సొంతం చేసుకున్నారు. శివాజి..ది బాస్ తర్వాత రజనీ, రెహమాన్, శంకర్ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం ఆడియో పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ చిత్రంలో రజనీ సరసన ఐశ్వర్య రాయ్ చేసింది. రోబో గా, సైంటిస్టుగా రజనీ ఈ చిత్రంలో కనిపించి మురపించనున్నారు.


Click it and Unblock the Notifications











