రోబో విన్యాసాలు
రజనీకాంత్, శంకర్ ల కలయికలో 'శివాజీ" తరవాత రూపుదిద్దుకొంటున్న చిత్రం 'రోబో". ఐశ్వర్యరాయ్ కథానాయిక భారీ వ్యయంతో నిర్మితమవుతున్న చిత్రం కోసం ఓ ప్రత్యేకమైన సెట్ ను (ఒలింపియా టెక్ పార్క) చెన్నై శివార్ల లో నిర్మించారు. సాబు సిరిల్ కళా దర్శకత్వం వహించారు. ఓల్వో బస్సును శాటిలైట్ రిమోట్ సెన్సింగ్ ల్యాబ్ గా తీర్చిదిద్దారు. దాంతో పాటు రోబో అసంకల్పిత చర్యల ద్వారా చెల్లా చెదురైన ప్రాంగణానికి సంబంధించిన వాతావరణాన్ని కూడా ఓ సెట్ గా వేశారు. ఇక్కడే 'రోబో" కి సంబంధించిన పతాక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. పేలుడు జరిగే సన్నివేశాల్ని చిత్రించేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఝానాన్ని ఉపయోగించుకోబోతున్నట్టు తెలిసింది. భారతీయ చలన చిత్ర సీమలో అగ్ని సంబంధిత పోరాటాలను చిత్రించడానికి విదేశీ పరికరాలను వాడడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.
robo rajinikanth aishwarya rai shankar olympia tech park రోబో రజనీకాంత్ ఐశ్వర్య రాయ్ శంఖర్ ఒలింపియా టెక్ పార్క్


Click it and Unblock the Notifications