కళ్ళు తిరిగే బడ్జెట్..ప్రిట్లతో రజనీ రోబో రెడీ
రజనీకాంత్, శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న రోబో చిత్రం బడ్జెట్ రెండు వందల కోట్లకు చేరుకుందని తమిళ మీడియా అంటోంది. మొదట వందకోట్ల బడ్జెట్ అని దిగిన ఈ చిత్రం ఆ తర్వాత 120 కోట్లుకు పెరిగింది. సన్ నెట్ వర్క్ వారు కలిసిన తర్వాత 150 కోట్లుకు ఫిక్స్ చేసారు. అయితే చిత్రం పూర్తయి ఫస్ట్ కాపీ వచ్చేసరికి 200 కోట్లను చేరుతుందని అంచనా. అలాగే ఈ చిత్రం బడ్జెట్ కు తగ్గట్లో 2000 వేల ప్రింట్లతో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అలాగే రజనీ ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్న జపాన్, చైన్ లలో కూడా అదే రోజు ఎక్కువ ప్రింట్లతో రిలీజ్ చేసి విజయం సాధించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇక సైన్స్ ఫిక్షన్ గా తయారయ్యే ఈ సినిమాలో రజనీకాంత్ రోబోగాను, సైంటిస్ట్ గానూ కనిపించనున్నారు. ఐశ్వర్యా రాయ్ హీరోయిన్ గా చేస్తోంది. ఇక ఈ చిత్రం ఆడియోని మలేషియాలో ఆగస్టులో విడుదల అవుతుంది.


Click it and Unblock the Notifications











