'రోబో' తెలుగు రైట్స్ వివాదంలో ఇద్దరు అరెస్టు...
రజనీకాంత్, శంకర్ కాంబినేషన్ లో ప్రతిష్టాత్మకంగా రూపొందిన రోబో చిత్రం తెలుగు రీమేక్ రైట్స్ వివాదం మరో మలుపు తిరిగింది. ఈ వివాదంలో భాగంగా సురేందరన్(44), ఉదయ్ కుమార్(46) అనే ఇద్దరు వ్యక్తులను చెన్నై పోలీసులు అరెస్టు చేసారు. వీరు దొంగ డాక్యుమెంట్స్ తో తెలుగు వెర్షన్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ని తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ చదలవాడ శ్రీనివాసరావుకి అమ్మారని ఆరోపణ. మొత్తం 27 కోట్లకు బేరం సెట్ చేసి రెండు కోట్ల రూపాయలు అడ్వాన్స్ గా తీసుకున్నారు. ఇక ఈ విషయం తెలుసుకున్న తమిళ నిర్మాతలు సన్ నెట్ వర్క్ వారు వెంటనే యాక్షన్ లోకి దిగి చెన్నైలోని పట్టినపక్కం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఫైల్ చేసారు. ఇన్విస్టిగేషన్ చేసిన పోలీసులు డిస్ట్రిబ్యూటర్ ని తమ దగ్గర ఉన్న ఫేక్ కాగితాలతో మోసం చేసినట్లు వెళ్ళడయింది. ఇక ఈ విషయమై మరో సారు సన్ నెట్ వర్క్ వారు రోబో డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ఏ భాషలోనూ అమ్మలేదని మరో సారి స్పష్టం చేసారు.


Click it and Unblock the Notifications











