షాకిచ్చే రేంజిలో 'రోబో' టికెట్ల బుకింగ్
అంతటా అప్పుడే "రోబో" (తమిళ ఎందిరన్) మ్యానియా మొదలైంది. తమిళనాడులో రోబో టికెట్ల అడ్వాన్స్ బుకింగ్ శనివారం నుంచి ప్రారంభమైంది. ఈమేరకు టికెట్లన్నీ వారం రోజులకు నిమిషాలవ్యవధిలోనే బుక్ అయిపోవడం అందరినీ షాక్ కు గురి చేసింది. టిక్కెట్లు స్పీడుగా అమ్ముడవుతాయని అంతా భావించారు కానీ ఈ రేంజిని ఎవరూ ఊహించలేదు. ఇక ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తమిళం, తెలుగు, హిందీ భాషలలోఈ చిత్రం రెండువేలకు పైగా ప్రింట్లతో విడుదల కానుంది. రజనీకాంత్, ఐశ్వర్య రాయ్ జంటగా డెరైక్టర్ శంకర్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధిమారన్ నిర్మించిన చిత్రం రోబో.
ఈ టిక్కెట్లు కోసం తెల్లవారు ఝామున జామున నాలుగు గంటలకే అభిమానులు థియేటర్ల కౌంటర్ల వద్ద బారులుతీరారు. అభిమానులు రద్దీ అధికం అవడంతోకొన్ని థియేటర్ల వద్ద పోలీసు బందోబస్తుఏర్పాటు చేయాల్సి వచ్చింది. చెన్నై సత్యం థియేటర్ ఉదయం కాంప్లెక్స్ వద్ద అర గంటలోనే వారంరోజలకు సరిపడా టికెట్లు అమ్ముడైపోయాయి. అదేవిధంగా అమీర్ థియేటర్ లో బుకింగ్ ప్రారంభమైన 20 నిమిషాలకే వారంరోజుల టికెట్లు విక్రయించడం విశేషం. చెన్నైలోని సత్యం, ఐనాక్స్, పీవీయార్ తదితర 32థియేటర్లలో ఇంచుమించు ఒక గంట వ్యవధిలోవారం రోజులకు టికెట్లు బుకింగ్ పూర్తయిపోయింది. ఇంత రికార్డుస్థాయిలో అడ్వాన్స్ బుకింగ్ జరగడం చలన చిత్ర పరిశ్రమలో ఇదేప్రథమం అని థియేటర్ల యాజమాన్యంపేర్కొంది.
అమెరికాలో ఈ చిత్రం టికెట్లుఅడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైన పది నిమిషాలలోనే వారం రోజులకు టికెట్లు బుకింగ్ అయిపోయాయి. టికెట్ ధరలు హాలీవుడ్ చిత్రాలకంటే ఎక్కువైనా బుకింగ్ రికార్డుస్థాయిలో జరగడం ఆశ్చర్యం కలిగిస్తోందని అక్కడి థియేటర్ యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. సైన్స్ ఫిక్షన్ గా రూపొందింన ఈ చిత్రం రూ.180 కోట్లతో ఆసియాలోనే భారీ బడ్జెట్ చిత్రంగా నిర్మితమైంది. ప్రపంచవ్యాప్తంగా అక్టోబరు 1న 2,250 ప్రింట్లతో విడుదల కాబోతోంది. తెలుగులో 500లకు పైగా ప్రింట్లతో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రానికి మాటలు: శ్రీరామకృష్ణ, కెమెరా: ఆర్.రత్నవేలు, కళ: సాబు సిరిల్, సౌండ్ ఎఫెక్ట్స్: రసూల్ పూకుట్టి, నిర్మాత: కళానిధి మారన్, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: శంకర్.


Click it and Unblock the Notifications











