సూపర్ స్టార్ ట్రయాంగిల్ లవ్ స్టోరియే ‘రోబో’...!?
తమిళ దర్శకుడు శంకర్ రోబో కోసం తీసుకున్న కథాలైన్ చూస్తే చాలా చిన్నది. కాని కధనం, మరమనిషిని తెరపై సృష్టించే ప్రయత్నం సాహాసంతో కూడుకున్నది. ఆ సాహాసమే రోబో రూపంలో సెప్టెంబర్ 3న జనం ముందుకు రానుంది. నిజానికి రోబో కథ ఒక ముక్కోణపు ప్రేమ కథా చిత్రమని చెప్పుకోవచ్చు. రజనీకాంత్ సైంటిస్ట్ గా సమాజానికి టెక్నాలజీ ఉపయోగపడాలని ఒక మరమనిషిని తయారు చేస్తాడు. నిజమైన మనిషి రజనీకాంత్ ఏ ఐశ్వర్య రాయ్ ను అయితే ప్రేమిస్తాడో, రోబో కూడా అదే ఐశ్వర్యరాయ్ ను తెగ ప్రేమించేస్తాడు.
రోబో తన ప్రియురాలిని ప్రేమించడంతో నిజమైన మనిషి ఎలాంటి తపన పడతాడు? అనంతరం జరిగిన పరిణామాలు ఏమిటి? అనేదే ఈ సినిమా కథ. దీన్నీ కాస్త వైవిద్యంగా గ్రాఫిక్స్ మాయాజాలంతో తెరకెక్కించాడు శంకర్. రోబో ఆడియోను నిర్వహించిన ఓ మీడియా సంస్థ పంపించిన మీడియా ఆహ్వాన పత్రికలో మాత్రం సెప్టెంబర్ 3న విడుదల అవుతున్నట్టు ఉండటం విశేషం.


Click it and Unblock the Notifications











