డ్రగ్స్ కేసులో శ్రీకాంత్‌కు ఎదురు దెబ్బ.. జ్యుడిషియల్ కస్టడీ విధింపు.. రిమాండ్ ఎప్పటి వరకు అంటే?
తమిళ, తెలుగు, మలయాళంలో గుర్తింపు పొందిన శ్రీకాంత్ అలియాస్ శ్రీరామ్‌ను డ్రగ్స్ కేసులో గ్రేటర్ చెన్నై పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచడంతో ఆయనను జ్యూడిషయల్ కస్టడీకి పంపుతూ ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసులో ఆయనకు ప్రత్యక్షంగా సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలకు సాక్ష్యం లభించడంతో ఆయనను అరెస్ట్ చేస న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. దాంతో ఆయనను కస్టడీకి తరలిస్తూ ఆదేశాలు జారీ చేశారు. శ్రీకాంత్ అరెస్ట్ వెనుక పూర్తి కథనంలోకి వెళితే..
చెన్నైలో ఏఐఏడీఎంకే ఐటీ వింగ్‌కు సంబంధించిన కార్యకర్త టీ ప్రసాద్‌ను ఓ బార్‌లో జరిగిన గొడవలో అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో ఏఐఏడీఎంకే నేత టీ ప్రసాద్ సంచలన విషయాలు వెల్లడించారు. ప్రదీప్ అనే డ్రగ్ సప్లయర్ నుంచి సుమారుగా 4.72 లక్షల రూపాయల విలువైన నిషేధిత కొకైన్‌ను 40 సార్లు కొనుగోలు చేశాను అని పోలీసులకు తెలిపాడు. ఈ క్రమంలోనే తాను కొంత కొకైన్‌ను నటుడు శ్రీకాంత్‌కు కూడా అమ్మానని చెప్పాడు. నటుడు శ్రీకాంత్‌కు కొకైన్ అమ్మినట్టు, ఆయన వద్ద నుంచి 12 వేల రూపాయలు స్వీకరించినట్టు విచారణలో వెల్లడించారు. దాంతో శ్రీకాంత్‌కు సమన్లు జారీ చేశారు. అనంతరం ఆయనను అరెస్ట్ చేసి కిల్‌పాక్ మెడికల్ కాలేజీలో డ్రగ్స్ వినియోగ నిర్ధారిత వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో ఆయనకు పాజిటివ్ అని తేలడంతో అధికారికంగా అరెస్ట్ చేసినట్టు ప్రకటించారు.

శ్రీకాంత్‌ను అరెస్ట్ చేస్తున్నట్టు ప్రకటించిన గ్రేటర్ చెన్నై పోలీసులు వెంటనే ఎగ్మోర్‌లోని 14వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులోని న్యాయమూర్తి దయాలన్ ఎదుట ప్రవేశపెట్టారు. అయితే కోర్టు సెలవుల కారణంగా ఆయనను జ్యూడిషియల్ ఆఫీసర్ క్వార్టర్స్‌లోని న్యాయమూర్తి నివాసంలో శ్రీకాంత్‌ను హాజరుపరిచారు. అయితే శ్రీకాంత్ తరఫున విగ్నేష్ రామనాధన్ వాదనలు వినిపించాడు. అయితే న్యాయవాది వాదనలు సంతృప్తి చెందిన న్యాయమూర్తి .. శ్రీకాంత్‌ను జూలై 7వ తేదీ వరకు జ్యూడిషియల్ కస్టడీ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దాంతో ఆయనను పోలీసులు రిమాండ్‌కు తరలించారు.
ఇదిలా ఉండగా, సోమవారం నాడు నుంగంబాకం పోలీసులు శ్రీకాంత్‌ను అదుపులోకి తీసుకొన్నారు. ప్రసాద్ ఇచ్చిన సమాచారం ఆధారంగా దాదాపు 9 గంటలపాటు ఆయనను విచారించారు. అనంతరం ఆయనకు డ్రగ్స్ వినిమోగ నిర్ధారిత పరీక్షలు జరిపించారు. ఆ పరీక్షల ఫలితాలు పాజిటివ్‌గా రావడంతో ఆయనను కోర్టులో హాజరుపరిచారు. ఆయన తరఫు న్యాయవాది బెయిల్ కోసం చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో శ్రీకాంత్‌ను రిమాండ్‌కు తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
శ్రీకాంత్ కెరీర్ విషయానికి వస్తే.. కే బాలచందర్ రూపొందించిన టెలివిజన్ షో జన్నల్ మరబు కవితైగల్ ద్వారా వినోద రంగంలోకి ప్రవేశించారు. 2002 సంవత్సరంలో రోజా పూలు సినిమా ద్వారా చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించారు. ఆ తర్వాత ఒకరికొకరు, ఎర్ర చీర, ఆడవాళ్ల మాటలకు అర్ధాలే వేరులే, రావణాసుర, తాజాగా పిండం, హరికథ అనే వెబ్ సిరీస్‌లో అనే సినిమాల్లో నటించారు. తమిళంలో శంకర్ దర్శకత్వంలో హిందీ త్రీ ఇడియెట్స్ రీమేక్ నాంబన్ చిత్రాల్లో నటించారు. ఈ వార్తకు సంబంధించిన మరింత సమాచారం కోసం ఫిల్మీబీట్‌ను ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications











