డ్రగ్స్ కేసులో శ్రీకాంత్ అరెస్ట్.. పొలిటీషియన్ లీక్‌తో పోలీసుల ఉచ్చులో..

తెలుగు, తమిళంతోపాటు పలు దక్షిణాది భాషల్లో నటించిన శ్రీకాంత్‌ను డ్రగ్స్ కేసులో చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ కేసులో ఆధారాలు లభ్యం కావడంతో ఆయనను పలు ఆరోపణలపై అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. అయితే అధికారికంగా ఆయనపై కేసు నమోదు చేయలేదు. ఏఐడీఎంకే నేతను ఈ వ్యవహారంలో నుంగమ్‌బాకమ్‌లో అరెస్ట్ చేయడం, ఆయన చెప్పిన వివరాల ఆధారంగా శ్రీకాంత్‌ను అదుపులోకి తీసుకొన్నట్టు తెలుస్తున్నది. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

ఇటీవల చెన్నైలోని ఓ బార్‌లో జరిగిన గొడవలో ప్రసాద్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయనను విచారించగా.. నటుడు శ్రీకాంత్‌కు డ్రగ్స్ సరఫరా చేశాం. ఒక గ్రామ్ కొకైన్‌ను 12 వేల రూపాయలకు మా వద్ద నుంచి ఆయన కొనుగోలు చేశాడు అని సదరు వ్యక్తి వెల్లడించారు. దాంతో శ్రీకాంత్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

Roja Kootam Fame Srikanth arrest in Drugs Case in Chennai

హీరో శ్రీకాంత్‌ను విచారణకు హాజరు కావాలని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సమన్లు జారీ చేసింది. ఆ తర్వాత ఆయనను అరెస్ట్ చేసి డ్రగ్స్ తీసుకోన్నాడా? లేదా అని నిర్ధారించుకొనేందుకు పోలీసులు రక్త నమూనాలు సేకరించారు. రక్త నమూనాలో వచ్చే ఫలితాలను బట్టి ఆయనపై చర్యలు ఎలా తీసుకోవాలో పోలీసులు నిర్ధారిస్తారు అని మీడియాకు వెల్లడించారు.

రోజాపూలు, ఒకరికొకరు, ఎర్ర చీర, ఆడవాళ్ల మాటలకు అర్ధాలే వేరులే, రావణాసుర, తాజాగా పిండం, హరికథ అనే వెబ్ సిరీస్‌లో అనే సినిమాల్లో నటించారు. తమిళంలో శంకర్ దర్శకత్వంలో హిందీ త్రీ ఇడియెట్స్ రీమేక్ నాంబన్ చిత్రాల్లో నటించారు. ఈ వార్తకు సంబంధించిన మరింత సమాచారం కోసం ఫిల్మీబీట్‌ను ఫాలో అవ్వండి.

More from Filmibeat

Read more about: srikanth chennai pindam
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X