రోజా హీరో మళ్ళీ రాడంట
మణిరత్నం రోజా చిత్రంతో పాపులర్ అయిన అరవిందస్వామి ఆ తర్వాత మళ్ళీ వెండితెరపై కనిపించలేదు. రెండు రోజుల క్రిందట చెన్నైలోని ఓ స్కూల్లో పంక్షన్ కి ఛీఫ్ గెస్ట్ గా అటెండయిన ఈయన మీడియాతో ముచ్చటించారు.తాను తిరిగి రీ ఎంట్రీ అవకాశం లేదని తేల్చేసారు. తమిళం నుండి పెద్ద డైరక్టర్స్ మంచి క్యారెక్టర్స్ తో ముందుకొచ్చారు..కానీ నాకు కనపడటం ఇష్టంలేదు. నాకు ఇరవై ఏళ్ళ వయస్సులో దళపతి చేసాను. చాలా ఎంజాయ్ చేసాను. ఆ రోజులు నిన్నే జరిగినంత ప్రెష్ గా ఉన్నాయి నా మనస్సులో. ఇప్పుడు కొత్తగా మళ్ళీ నటించి వాటిని గతం లోకి తోయాల్సిన పనేముంది అన్నారు. ప్రస్తుతం సేవా కార్యక్రమాలతో బిజీగా ఉన్నాను. ఇప్పటికీ ఎక్కడికి వెళ్ళినా నన్ను రోజా అరవిందస్వామిగా గుర్తిస్తున్నారు..చాలా ఆశ్చర్యం వేస్తుంది వారి మెమరి పవర్ కి. అదంతా నా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తాను. సినిమాల్లో చేయగలిగింది అవకాశమున్నంత వరకూ చేసాను. ప్రస్తుతం సొసైటీకి చేద్దామనే నిర్ణయానికి వచ్చాను అని ముగించారు.


Click it and Unblock the Notifications











