twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎక్కడ విన్నా ఈ పాటే...పెద్ద హిట్టైంది (వీడియో)

    By Srikanya
    |

    చెన్నై : లక్ష్మణ్‌ దర్శకత్వంలో జయం రవి హీరోగా నటిస్తున్న చిత్రం 'రోమియో జూలియట్‌'. ఇందులో హన్సిక హీరోయిన్. పూనంభజ్వా రెండో హీరోయిన్. డి.ఇమాన్‌ స్వరాలు సమకూర్చారు. ఈ సినిమా ఆడియో విడుదల రీసెంట్ గా కార్యక్రమం చెన్నైలో జరిగింది. కార్యక్రమంలో నటుడు ధనుష్‌, జీవా, విజయ్‌సేతుపతి, కృష్ణ, దర్శకుడు ప్రభుదేవా, రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు. ఇందులో అనిరుధ్‌ పాడిన 'డండనకా..' పాట ఇప్పటికే అన్ని ఎఫ్‌ఎం, టీవీ ఛానెళ్లలో మారుమోగుతోంది. ఆ పాటను మీరూ చూడండి.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    దర్శకుడు మాట్లాడుతూ.. ఎస్‌జే సూర్య నటించిన 'కల్వనిన్‌ కాదలి' చిత్రానికి దర్శకుడిగా కోలీవుడ్‌లో అడుగుపెట్టా. ఆ తర్వాత కొన్ని చిత్రాలు విడుదల చేశా. ఎప్పటి నుంచో దర్శకుడు కావాలని, 'రోమియో జూలియట్‌' కథను తెరపై ఆవిష్కరించాలన్నదే నా ఆశ. ఆ కలతో 'రోమియో జూలియట్‌'కు ఇప్పుడు దర్శకుడిగా మారానని అన్నారు.

    సంగీత దర్శకుడు డి.ఇమాన్‌ మాట్లాడుతూ.. నిన్నటి వరకు అన్ని గ్రామీణ చిత్రాలకే సంగీతం సమకూర్చేవాడిని. బాణీలు కట్టాలంటే.. అంతా తాటి తోపు, పచ్చని చెట్లు, పల్లె, ఎద్దలబండి.. ఇవే కనిపించేవి. కానీ ఇప్పుడు అందుకు పూర్తి భిన్నంగా 'రోమియో జూలియట్‌'కు స్వరాలు సమకూర్చా. అంతా మిద్దెలు, మేడలు, పబ్‌లు, క్లాస్‌ కల్చర్‌కు బాణీ కట్టా. ఇదో కొత్త అనుభవం. తామరై, మదన్‌కార్కి, రోకేష్‌ రాసిన పాటలు అనుకున్నట్టే బాగొచ్చాయని అన్నారు.

    Romeo Juliet - Dandanakka Making Video

    అనంతరం నటుడు జయం రవి మాట్లాడుతూ.. అద్భుతమైన దర్శకుడి పరిచయ చిత్రంలో హీరోగా నటించడం ఆనందంగా అనిపిస్తోంది. ఇది అసలైన 'రోమియో జూలియట్‌' కథ కాదు. ఆ కథ చివర్లో ట్రాజెడీగా ఉంటుంది. కానీ ఈ కథ సుఖాంతంగా ముగిస్తుంది. అనిరుధ్‌ పాడిన 'డండనకా..' పాట ఇప్పటికే అన్ని ఎఫ్‌ఎం, టీవీ ఛానెళ్లలో మారుమోగుతోంది. సినిమా విడుదలయ్యాక యువత మెచ్చిన పాటగా ఉంటుంది. ఇలాంటి పాటను అందించిన ఇమాన్‌కు కృతజ్ఞతలు చెప్పారు.

    English summary
    The Dandanakka song sung by Anirudh has been receiving great responses
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X