twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రామ్ గోపాల్ వర్మ ఆడియో ఫంక్షన్‌కు ఛీఫ్ గెస్ట్ రోశయ్య

    By Srikanya
    |

    చెన్నై : రామ్ గోపాల్ వర్మ చిత్రం ఆడియో పంక్షన్ కి రోశయ్య ఛీఫ్ గెస్ట్ గా రానుండటం ఇప్పుడు చర్చనీయాంసమైంది. ఆ చిత్రం మరేదో కాదు సత్య సీక్వెల్. శర్వానంద్ హీరోగా రూపొందుతున్న ఈ చిత్రం తమిళంలో నాందాండ పేరుతో విడుదల అవుతోంది. ఆ నేపధ్యంలో తమిళం లోచిత్రాన్ని నిర్మిస్తున్న దేవిశ్రీదేవి సతీష్ ...తమిళనాడు గవర్నర్ రోశయ్యను ఈ చిత్రం ఆడియో పంక్షన్ కి ఆహ్వానించారు. ఈ నెలలోనే చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సతీష్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ రోశయ్యను ఆహ్వానించినట్లు వెల్లడించారు. చిత్రాన్ని సెప్టెంబర్‌లో విడుదల చేసేందుకు యత్నిస్తున్నామన్నారు.

    అలాగే ఈ చిత్రానికి మరో విశేషముంది.. ఈ చిత్రం ట్రైలర్‌కు కలైపులి థాను వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. దానికి కారణం చెప్తూ.... నాందాండ ఉత్తర చెన్నై బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న చిత్రమని సతీష్ వివరించారు. చిత్ర సంభాషణలు ఆ ప్రాంత యాసలోనే ఉంటాయని చెప్పారు. చిత్ర ట్రైలర్‌కు వాయిస్ ఓవర్ నేటివిటీకి తగ్గట్టుగా ఉంటే బాగుంటుందని భావించానన్నారు. అందువలనే ఉత్తర మద్రాసులో పుట్టిన పెరిగిన ప్రముఖ నిర్మాత కలైపులి ఎస్.థానుతో ట్రైలర్‌కు వాయిస్ ఓవర్ చెప్పించామని తెలిపారు. ఎన్నో భారీ చిత్రాలను నిర్మించిన కలైపులి ఎస్.థాను తొలిసారిగా వాయిస్ ఓవర్ ఇస్తున్న చిత్రం నాందాండా కావడం విశేషం.

    ఇక తెలుగు, హిందీలతో పోల్చుకుంటే తమిళ సినిమాలు చాలా వైవిధ్యంగా ఉంటాయి. నాకు ఎప్పటి నుంచో నేరు తమిళచిత్రాన్ని తెరకెక్కించాలని అనుకుంటున్నా. కుదరలేదు. భాష తెలియకపోవడమే ఇందుకు కారణం. ఇప్పుడు తమిళం పూర్తిస్థాయిలో అర్థం చేసుకోగలను. అందుకే తమిళంలో తెరకెక్కించాలనుకున్నా అన్నారు రామ్ గోపాల్ వర్మ.

    అలాగే రాంగోపాల్‌వర్మ మాట్లాడుతూ.. .తిరుచ్చి, మదురై ప్రాంతాల్లో షూటింగ్ జరిపాం. చెన్నైలో కొన్ని సన్నివేశాలు తెరకెక్కించాల్సి ఉంది. శర్వానంద్‌ పాత్ర కొత్తగా ఉంటుందని చెప్పారు. హింసాత్మక కథాంశాలనే ఎందుకు ఎంచుకుంటున్నారని ప్రశ్నించగా.. నాలో క్రూర గుణాలు ఎక్కువ అందుకే ఇలాంటి కథను ఎంచుకుంటానని చెప్పారు.

    శర్వానంద్‌ మాట్లాడుతూ.. రాంగోపాల్‌వర్మ దర్శకత్వంలో ఇలాంటి పాత్రలో నటిస్తానని అస్సలు ఊహించలేదు. ఈ సినిమా నా కెరీర్‌ను తప్పకుండా మలుపుతిప్పుతుంది, రామ్‌గోపాల్‌ వర్మ సినిమాలో చిన్న పాత్రైనా చేయాలన్నది నా కల. అది ఇప్పుడు తీరింది. ఆయన దగ్గర నుంచి రోజూ ఏదొక విషయం నేర్చుకున్నాను. ఈ సినిమాలో కొత్త రకం నేరాల్ని చూపించబోతున్నారు అన్నారు.

    నిర్మాత మాట్లాడుతూ ''మంచి సినిమాను తీశానని అనుకుంటున్నా. విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంద''న్నారు. అనైక మాట్లాడుతూ ''ఇది నా మొదటి సినిమా. వర్మగారి దర్శకత్వంలో నటించడం చాలా ఆనందంగా ఉంది''అన్నారు.

    English summary
    The Honorary Governor of Tamil Nadu, Shri Rosaiah, will be the Chief Guest for RGV's Satya-2 audio function. The movie will be a bilingual.'Satya-2', starring Sharwanandh in the lead role. This is the sequel of his super hit film, 'Satya', that was released in 1998. This film is also being made on a mafia backdrop.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X