నా పాత్ర అందరికి ప్రేరేపిస్తూ ముందుకు సాగుతుంది: శ్రియ
ఈ చిత్రంలో చేస్తున్నప్పుడు నా స్టూడెంట్ లైఫ్ గుర్తొచ్చింది..సామాజిక స్పృహ ఉన్న సినిమా కావడంతో ఎంతో ఇష్టపడి చేశాను. అలాగే ఈ పాత్ర అందరినీ సమాజ ఆలచోనలు వైపు ప్రేరేపిస్తుంది అంటోంది శ్రియ. ఆమె తాజాగా తమిళంలో చేస్తున్న రౌదిరం చిత్రం గురించి మాట్లాడుతూ. జీవా హీరోగా రూపొందుతున్న ఈ చిత్రంలో ఆమె లా స్టూడెంట్ గా కనిపించనుంది. ఆ పాత్ర తనకు చాలా ప్రేరణని ఇస్తోందంటోంది. అలాగే తన జీవితాంతం ఆ పాత్ర గుర్తుండిపోతుందని చెప్తోంది. అలాగే ఇందులో వార్తా పత్రికల్లో మనం చదివే సంఘటనల గురించి ఈ చిత్రంలో చర్చించడం జరిగింది అంటోంది. ఇక ప్రస్తుతం శ్రియ ఇంగ్లిష్ చిత్రం మిడ్ నైట్ చిల్డ్రన్, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో రూపొందనున్న పానీ చిత్రాలు కమిట్ అయ్యారు. ఈ నెలలోనే మిడ్ నైట్ చిల్డ్రన్ షూటింగ్ ఆరంభమవుతుంది. పానీ షూటింగ్ ఫిబవరిలో ప్రారంభం అవుతుంది. మలయాళంలో ఆమె నటిస్తున్న కాసనోవా షూటింగ్ ఇటీవలే తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది.


Click it and Unblock the Notifications











