twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    డబ్బులు వెనక్కి ఇమ్మని 'ఢమురకం'డిస్ట్రిబ్యూటర్ కంప్లైంట్

    By Srikanya
    |

    చెన్నై :నాగార్జున తాజా చిత్రం 'ఢమురకం'నిర్మాతలు ఆర్.ఆర్ మూవీ మేకర్స్ వారు మరో తలనొప్పిలో ఇరుక్కున్నారు. ఈ చిత్రం తమిళ డిస్ట్రిబ్యూషన్ తీసుకున్న రామనాధన్..తనకు డబ్బుకు రికవరి చేయాలని తమిళనాడు డిస్ట్రిబ్యూషన్ అశోషియేషన్ లో కంప్లైంట్ చేసారు. చెన్నైకి చెందిన అభిరామి థియోటర్ ఓనర్ అయిన రామనాధన్ ఈ చిత్రం పంపిణీ హక్కులను ముప్పై లక్షలకు తీసుకున్నారు. అయితే పది లక్షలు మాత్రమే వచ్చాయని,మిగతా ఇరవై లక్షలూ రికవరి చేయాలని కోరుతూ పిర్యాదు చేసారు.

    దాంతో తమిళనాడు డిస్ట్రిబ్యూషన్ అశోషియేషన్ ..ఆర్.ఆర్.మూవీ మేకర్స్ పై రెడ్ మార్క్ విధించింది. తమిళనాడు ఈ బ్యానర్ నుంచి వచ్చిన ఏ చిత్రమూ విడుదల చేయకూడదని ఆర్డర్స్ పాస్ చేసారు. ఆర్.ఆర్.మూవీ మేకర్స్ వారు డిస్ట్ర్రిబ్యూటర్స్ కు అయిన లాస్ ని కాంపన్ససేట్ చేసి విషయం సెటిల్ చేసుకోవాలంటున్నారు. ఈ విషయమై ఆర్.ఆర్.మూవీమేకర్స్ వారి స్పందన తెలియరాలేదు.

    మరో వైపు నాగార్జున 'ఢమరుకం' సినిమా విడుదల చాలా ఆలస్యం అయినప్పటికీ మంచి విజయం సాధించిందని, తన కెరీర్లోనే పెద్ద హిట్ గా నిలిచిందని, ఇప్పుడు నేను నిజమైన కింగ్ లా ఫీలవుతున్నాను అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు అక్కినేని నాగార్జున. సినిమాను హిట్ చేసిన వారికి, సినిమా విజయం కోసం కృషి చేసిన వారికి ఆయన థ్యాంక్స్ చెప్పారు.

    మరో వైపు సినిమా పైరసీపై నాగార్జున ఆందోళన వ్యక్తం చేసారు. పీరసీని ప్రొత్స హించ వద్దని, అలాంటివి ఎవరి దృష్టికైనా వస్తే పోలీసులకు లేదా యాంటీ పైరసీ సెల్ కు సమాచారం అందించాలని కోరారు. నిర్మాత అచ్చిరెడ్డి మాట్లాడుతూ సినిమా ఆలస్యం అయినందుకు క్షమాపణలు చెప్పారు. డమరుకం సినిమా నాగార్జున కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచిందని, ఈ చిత్రం 3 రోజుల్లో 18 కోట్లు వసూలు చేసినట్లుగా అచ్చిరెడ్డి తెలిపారు. హీరోయిన్ అనుష్క మాట్లాడుతూ సినిమాకు ఓ ఆర్టిస్టుగా కాకుండా ఓ భక్తురాలిగా పని చేసానని, అరుంధతి చిత్రం తర్వాత అటువంటి తరహా చిత్రంలో పని చేయడం ఆనందంగా ఉందని చెప్పుకొచ్చింది.

    నాగార్జున, అనుష్క జంటగా నటించిన చిత్రం 'ఢమరుకం' క్రిందటి నెలలో విడుదలై యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్, గణేష్ వెంకట్రామన్, బ్రహ్మానందం, రఘుబాబు, ఎమ్మెస్ నారాయణ, కృష్ణభగవాన్, జీవా, ప్రగతి, కవిత, రజిత, గీతాంజలి, సత్యకృష్ణన్, ప్రియ, అభినయ, కల్పన, అపూర్వ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కథ: వెలిగొండ శ్రీనివాస్, కెమెరా: చోటా కె.నాయుడు, సహ నిర్మాత: వి.సురేష్‌రెడ్డి, సమర్పణ: కె.అచ్చిరెడ్డి, దర్శకత్వం : శ్రీనివాసరెడ్డి.

    English summary
    
 RR.Movie makers which faced lot of problems in releasing its latest venture 'Damarukam' starring Nagarjuna and Anushka seems to be plunging in problems galore. Ramanadhan of Abhirami Theater owner in Chennai, bought Damarukam release rights for Tamil Nadu for Rs 30 lakhs, filed a complaint with Tamil Nadu distribution association for recovery of Rs.20lakhs, as he has made only Rs 10 lakhs. The association red marked the banner and passed orders that they should not release any films in TN until RR Movie Makers settles the matter compensating Abirami theatre for the losses.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X