విక్రమ్...180కోట్ల వ్యాపారం

By Srikanya

చెన్నై : జాతీయ ఉత్తమ నటుడు విక్రమ్ పై ప్రస్తుతం 180కోట్ల వ్యాపారం నడుస్తోంది. ఆయన నటిస్తున్న మూడు చిత్రాలు శివ తాండవం, డేవిడ్,శంకర్ ఐ చిత్రాలన్నీ భారీ బడ్జెట్ తోనే నిర్మితమవుతున్నాయి. శంకర్ ఐ చిత్రం ఎనభై కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తూంటే,శివ తాండవం,డేవిడ్ చిత్రాలు తలో యాభై కోట్లతో నిర్మాణమవుతున్నాయి. తమిళ,తెలుగు మార్కెట్లను టార్గెట్ చేస్తూ నిర్మితమవుతూండటంతో బిజినెస్ కూడా అదే రేంజిలో అవుతుందని భావిస్తున్నారు. అలాగే ఈ మూడు చిత్రాలు కూడా యాక్షన్ చిత్రాలే కావటం విశేషం. తన తోటి హీరోలు అజిత్,సూర్య,విజయ్ లకు పోటీ ఇస్తూ విక్రమ్ ఈ స్ధాయిలో బిజినెస్ పెంచుకుంటూ వచ్చారు. ఈ మూడు చిత్రాలు కాక విక్రమ్ చేతిలో మరో నాలుగు సినిమాలు ఉన్నాయని,వాటిపై సైన్ చేయటానకి కొద్ది కాలం ఆగుతానని విక్రమ్ చెప్తున్నారు.

చియాన్‌ విక్రమ్‌, జగపతిబాబు కలిసి ఇప్పుడు 'శివతాండవం' చేయబోతున్నారు. యుటీవీ మోషన్‌ పిక్చర్స్‌ సమర్పణలో ఈ సినిమాను నిర్మాత సి. కళ్యాణ్‌ తెలుగువారి ముందుకు తెస్తున్నారు. అవుట్‌ అండ్‌ అవుట్‌ యాక్షన్‌ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.'శివపుత్రుడు' సినిమాలో సూర్యతో కలిసి నటించిన విక్రమ్‌ ఆ తర్వాత మల్టీస్టారర్‌ మూవీస్‌ చేయలేదు. అయితే ఇప్పుడు జగపతిబాబుతో కలిసి ఆయన 'తాండవం' అనే సినిమా కోసం స్ర్కీన్‌ స్పేస్‌ పంచుకున్నారు. యుటీవీ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు విజయ్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

'మదరాసి పట్టణం', 'నాన్న' సినిమాలతో సెన్సిటివ్‌ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న విజయ్‌ ఇప్పుడు ఈ యాక్షన్‌ మూవీని తీయడం టాక్‌ ఆఫ్‌ ద ఇండస్ర్టీ అయింది. లండన్‌లో రెండు నెలల పాటు షూటింగ్‌ జరుపుకున్న ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ ప్రస్తుతం జరుగుతోంది. 'తాండవం' సినిమాను 'శివతాండవం'గా తెలుగులో సి. కళ్యాణ్‌ విడుదల చేయబోతున్నారు.

'నాన్న' సినిమాలో విక్రమ్‌కు జోడీగా నటించిన అనుష్క ఈ సినిమాలోనూ హీరోయిన్‌గా చేస్తోంది. అలానే 'మదరాసి పట్టణం' ఫేమ్‌ యామీ జాక్సన్‌తో పాటు లక్ష్మీరాయ్‌ కూడా ఇందులో కీలక పాత్రను పోషిస్తోంది. ఎ. ఆర్‌. రెహమాన్‌ మేనల్లుడు జీవీ ప్రకాశ్‌ ఈ సినిమాకు మ్యూజిక్‌ అందిస్తున్నారు. ఆడియోను వచ్చే నెలలోనూ, సినిమాను సెప్టెంబర్‌లోనూ విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

ఈసారి రీమేక్స్‌ జోలికి పోకుండా శంకర్‌ తనదైన శైలిలో ఓ చిత్రం తీస్తున్నాడు. అయితే ఈసారి సామాజిక అంశాలని పెట్టుకోకుండా పూర్తిస్థాయి రొమాంటిక్‌ థ్రిల్లర్‌ని శంకర్‌ ప్లాన్‌ చేశాడు. విక్రమ్‌ హీరోగా శంకర్‌ తీసే చిత్రానికి 'ఐ' అనే పేరు ఖరారైంది. ఇందులో నటించే మెయిన్‌ హీరోయిన్‌ ఎవరనేది ఇంకా ఖరారు కాలేదు కానీ ఏమీ జాక్సన్‌ మాత్రం ఓ హీరోయిన్‌గా నటిస్తోంది. షూటింగ్‌ మొదలైన ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ శంకర్‌ విడుదల చేశాడు. చూడగానే ఆసక్తి కలిగించే విధంగా ఉన్న పోస్టర్‌ 'ఐ' అంచనాలు పెంచుతోంది. ఈసారి ఎక్కువ సమయం తీసుకోకుండా వేగంగా ఈ చిత్రం చేస్తానని శంకర్‌ చెబుతున్నాడు. అపరిచితుడు తర్వాత శంకర్‌, విక్రమ్‌ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కాబట్టి అభిమానుల్లో అంచనాలు ఎక్కువగా ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X