‘లింగా’ చిత్రానికి రూ. 200 కోట్ల ఇన్సూరెన్స్
హైదరాబాద్: రజనీకాంత్, అనుష్క, సోనాక్షి సిన్హా ప్రధానపాత్ర ధారులుగా కెఎస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘లింగా' చిత్రానికి రూ. 200 కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ చేయించారట. ఇంత పెద్ద మొత్తంలో ఇన్సూరెన్స్ చేయించిన తొలి సౌత్ మూవీ ఇదే కావడం గమనార్హం. ఇటీవల బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ నటించిన ‘కిక్' చిత్రం రూ. 250 నుండి రూ. 300 కోట్ల ఇన్యూసరెన్స్ చేయించడం హాట్ టాపిక్ అయింది. ఒక వేళ నష్టపోతే గట్టెక్కడానికి ఈ విధంగా ఇన్యూరెన్సు చేయిస్తున్నారు నిర్మాతలు.

ఈ సినిమా డిసెంబర్ 12న భారీ ఎత్తున విడుదలకి సిద్దమవుతోంది. లింగ సినిమా ఒక్క తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా రిలీజ్ కానుంది. ఈ సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న కొద్దీ ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఆ అంచనాలను మరింత పెంచి సినిమాని ప్రమోట్ చెయ్యడానికి ఈ చిత్ర టీం కూడా సన్నాహలు చేస్తోంది.
ఇప్పటివరకూ తెలుగులో ఎలాంటి ప్రమోషన్స్ లేకపోవడంతో ఈ చిత్ర టీం ముందుగా తెలుగులో కూడా భారీగా ప్రమోట్ చెయ్యడానికి రంగం సిద్దం చేసుకుంటోంది. సెన్సార్ బోర్డ్ నుంచి ‘యు' సర్టిఫికేట్ అందుకున్న ఈ సినిమా సుమారు 2,300కి పైగా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. రజినీకాంత్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో అనుష్క, సోనాక్షి సిన్హా గ్లామర్ పరంగా ఆకట్టుకోనున్నారు. ఎఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాకి హైలెట్. రాక్ లైన్ వెంకటేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు.


Click it and Unblock the Notifications











