twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇదెక్కడి తలనొప్పి.. లవ్ మ్యారేజ్‌పై కీర్తీ సురేష్ క్లారిటీ

    |

    మహనటిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్న కీర్తి సురేష్ మరోసారి వార్తల్లో హాట్ టాపిక్ గా మారింది. అమ్మడిపై ఇప్పటివరకు చిరాకు తెప్పించే రూమర్స్ ఎక్కువగా వచ్చింది లేదు. కానీ చాలా రోజుల తరువాత కీర్తికి కోపం తెప్పించే గాసిప్స్ కొన్ని మీడియాలలో వైరల్ అవుతున్నాయి. ఇక సోషల్ మీడియాలో కామెంట్స్ డోస్ కూడా పెరగడంతో మహానటికి కూడా అదొక తలనొప్పిగా మారినట్లు టాక్ వస్తోంది.

    మహానటిగా బిగ్గెస్ట్ క్రేజ్...

    మహానటిగా బిగ్గెస్ట్ క్రేజ్...

    కీర్తి సురేష్ కెరీర్ మొదట్లో కమర్షియల్ లవ్ సినిమాలు ఎన్ని చేసినా వాటికి వచ్చిన గుర్తింపు కంటే మహానటి తరువాత వచ్చిన క్రేజ్ చాలా ఎక్కువే అని చెప్పాలి. అలనాటి అందాల తార సావిత్రి జీవిత ఆధారంగా తెరకెక్కిన ఆ సినిమా మంచి వసూళ్లను అందుకుంది. కీర్తి సురేష్ తో లేడి ఓరియెంటెడ్ ప్రాజెక్ట్స్ కూడా చేయవచ్చని నిర్మాతలకు ఒక నమ్మకం వచ్చింది.

    బిజీ బిజీ షెడ్యూల్స్..

    బిజీ బిజీ షెడ్యూల్స్..

    ప్రస్తుతం లీడింగ్ సౌత్ యాక్టర్స్ లో కీర్తి సురేష్ టాప్ లో ఉందనే చెప్పాలి. సర్కార్ సినిమా అనంతరం పెద్ద సినిమాల్లో కూడా అవకాశాలు అందుకునే ప్రయత్నం చేస్తోంది. బాలీవుడ్, కోలీవుడ్ అని తేడా లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతోంది. కరోనా ఎఫెక్ట్ తో కాస్త బిజీ బిజీ షెడ్యూల్స్ నుంచి విముక్తి పొందిన అమ్మడికి ఓ కొత్త తలనొప్పి మొదలైంది.

    కీర్తి సురేష్ లవ్ మ్యారేజ్..?

    కీర్తి సురేష్ లవ్ మ్యారేజ్..?

    కీర్తి సురేష్ లవ్ లో ఉన్నట్లు రీసెంట్ గా కోలీవుడ్ మీడియాలో పుకార్లు మొదలయ్యాయి. కరోనా దెబ్బకు ఎలాంటి వార్తలు లేకపోవడంతో కొన్ని మీడియా వెబ్ సైట్లు ఈ విధంగా వార్తలు రాస్తున్నాయనే కామెంట్స్ వస్తున్నాయి. లవ్ లో ఉన్న మహానటి త్వరలో ఒక కుర్రాడిని లవ్ మ్యారేజ్ చేసుకోబోతున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఈ రూమర్స్ పై అమ్మడు చాలా సీరియస్ అయ్యింది. అలాంటిది ఏమైనా ఉంటే తప్పకుండా బయటకు చెబుతానని వివరణ ఇచ్చింది. కీర్తి సురేష్ సన్నిహితులు కూడా ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెబుతున్నారు.

    Recommended Video

    Keerthy Suresh To Marry A VIP's Son?
    బాలీవుడ్ లో కూడా బిజీ..

    బాలీవుడ్ లో కూడా బిజీ..

    తెలుగులో మన్మథుడు 2 సినిమా తరువాత మరో సినిమాలో కనిపించలేదు కీర్తి. నెక్స్ట్ మిస్ ఇండియా - రంగ్ దే సినిమాల ద్వారా తెలుగులో మంచి సక్సెస్ అందుకోవాలని ట్రై చేస్తోంది. అలాగే బాలీవుడ్ లో కూడా స్టార్ హీరోయిన్ గా ఎదిగేందుకు అమ్మడు బాగానే శ్రమిస్తోంది. ఇప్పటికే అజయ్ దేవ్ గన్ తో ఒక ఆఫర్ అందుకున్న ఈ బ్యూటీ మరో రెండు బి టౌన్ స్క్రిప్ట్ లను కూడా ఒకే చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

    English summary
    Rumors on mananatili actress Keerthy suresh love marriage, Keerthy Suresh, in a recent interview, said that the rumours about her wedding surprised her much.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X