సూపర్ స్టార్ రజనీకాంత్‌ ఆరోగ్య పరిస్థితిపై రూమర్స్ నిజమేనా?

By Srikanya

సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్‌ ఆరోగ్య పరిస్థితిపై శుక్రవారం,శనివారం కొన్ని రూమర్స్ వ్యాప్తి చెందాయి. శుక్రవారం రాత్రి ఆయన తీవ్ర అస్వస్థతకు గురవడంతో నగర శివారు పోరూర్‌లోని రామచంద్ర ఆస్పత్రికి తరలించారని, అక్కడ రజనీకాంత్‌కు ప్రత్యేక వైద్య బృందం పరీక్షలు నిర్వహిస్తోందని వార్తలు వచ్చాయి. అలాగే సోమవారం ఉదయం డిశ్చార్జి అయ్యే అవకాశాలున్నట్లు చెబుతున్నాయి. దాంతో ఎక్కడెక్కడి ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఇటీవల ఆయన కొద్ది రోజులు అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఇటీవలే ఇంటికి చేరుకున్నారు. ఇంతలో రజనీ ఆరోగ్యం విషమించిందంటూ వదంతులు వచ్చాయి. దీనిపై ఆయన భార్య లత స్పందించి ఓ ప్రకటన విడుదల చేశారు. అభిమానుల ఆశీస్సులు, ప్రార్థనల వల్ల ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు. ఈ రోజు చోటు చేసుకొన్న వదంతుల్లో నిజం లేదు. ఇంట్లో ఆయన విశ్రాంతి తీసుకొంటున్నారని ఆ ప్రకటనలో తెలిపారు. రజనీకాంత్‌ ఆరోగ్యంపై భిన్నమైన వార్తలు వినిపిస్తున్నాయి. ప్రారంభంలో కలుషిత ఆహారం వల్ల ఆనారోగ్యానికి గురయ్యారని చెప్పిన కుటుంబీకులు..ప్రస్తుతం విషజ్వరంతో బాధపడుతున్నట్లు పేర్కొంటున్నారు. శ్వాసకోశ సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్లు కూడా చెబుతున్నారు. ఏది నిజం..ఏది అబద్దం అనే అనమానాలు అభిమానుల్లో కలుగుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X