విజయ్ దేవరకొండ ప్లాప్ సినిమా కథతో స్టార్ హీరో.. త్వరగానే తేరుకున్నారు!

వరుస సినిమాల తాకిడితో సమ్మర్ సీజన్ మోతెక్కుతోంది. ఇప్పటికే చిత్రలహరి, జెర్సీ, అవెంజర్స్, కాంచన 3 చిత్రాలు విడుదలై కాసుల పంట పండించుకున్నాయి. త్వరలో సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి, నిఖిల్ నటించిన అర్జున్ సురవరం, సూర్య ఎన్జీకే చిత్రాలు మే నెలలోనే విడుదలకు సిద్ధం అవుతున్నాయి. ఇదిలా ఉండగా తమిళంతో సమానంగా తెలుగు లోకూడా మార్కెట్, అభిమానులని సంపాదించుకున్న హీరో సూర్య. సూర్య నటనకు, స్టైల్ కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఎన్జీకే చిత్రాన్ని సీనియర్ దర్శకుడు సెల్వరాఘవన్ తెరకెక్కించారు. ఈ చిత్ర కథ గురించి ఓ ఆసక్తికరమైన వార్త ప్రచారం జరుగుతోంది.

ఎన్జీకేతో ముడిపెడుతూ

ఎన్జీకేతో ముడిపెడుతూ

అర్జున్ రెడ్డి, గీత గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో దూకుడు మీద ఉన్న విజయ్ దేవరకొండకు నోటా చిత్రం కాస్త బ్రేకులు వేసింది. పొలిటికల్ డ్రామాగా తెలుగు, తమిళ భాషల్లో గత ఏడాది విడుదలైన ఈ చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది. ఈ చిత్రంలోవిజయ్ దేవరకొండ యంగ్ పొలిటీషియన్ గా నటించాడు. ఈ చిత్ర కథని సూర్య ఎన్జీకేతో ముడిపెడుతూ ఆసక్తికరమైన వార్తలు ప్రచారం జరుగుతున్నాయి.

 అదే కథతో

అదే కథతో

నోటా చిత్రాన్ని సూర్య బంధువు జ్ఞానవేల్ రాజా నిర్మించారు. అదే సమయానికి సూర్య ఎన్జీకే చిత్రం కూడా ప్రారంభమైంది. కానీ ముందుగా నోటా చిత్రం విడుదలై నిరాశపరిచింది. ఇక్కడ విషయం ఏంటంటే.. నోటా, ఎన్జీకే చిత్రాల కథలు దాదాపుగా ఒకేలా ఉన్నాయట. నోటా చిత్రం తీవ్రంగా నిరాశపరచడంతో ఇదే కథతో సినిమా తీస్తే తమకు కూడా దెబ్బ తప్పదని ఎన్జీకే చిత్ర యూనిట్ భావించి కథలో మార్పులు చేసినట్లు తెలుస్తోంది.

గత ఏడాదే

గత ఏడాదే

వాస్తవానికి ఎన్జీకే చిత్రం గత ఏడాదే షూటింగ్ పూర్తి చేసుకోవాల్సింది. కానీ కథలో మార్పులు చేయడం వల్ల షూటింగ్ ఆలస్యం అయ్యిందట. మొత్తానికి ఎన్జీకే చిత్ర యూనిట్ నష్టం జరగకుండా త్వరగానే తేరుకుని కథ విషయంలో జాగ్రత్తలు తీసుకుందని తమిళ సినీవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇటీవల ఎన్జీకే చిత్ర ట్రైలర్ విడుదలై ఆకట్టుకుంది. ఎప్పటిలాగే సూర్య అద్భుతమైన పెర్ఫామెన్స్ తో అదరగొడుతున్నాడు.

 సాయి పల్లవి

సాయి పల్లవి

క్రేజీ హీరోయిన్ సాయి పల్లవి ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవల జరిగిన ట్రైలర్ లాంచ్ వేడుకలో సాయి పల్లవి ఒక రేంజ్ లో సూర్యపై ప్రశంసలు కురిపించింది. సూర్య మిలియన్ లో ఒక్కడు.. ఆయన లాంటి వ్యక్తిని ఎంతవరకు చూడలేదు అంటూ సాయి పల్లవి పొగడ్తల వర్షం కురిపించింది. ఎన్జీకే చిత్రాన్ని మే 31న విడుదల చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X