Run Baby Run Collections ఆర్జే బాలాజీ ఖాతాలో రెండో హిట్.. తొలివారం ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
నటుడిగా మారిన రేడియో జాకీ ఆర్జే బాలాజీ నటించిన తాజా చిత్రం రన్ బేబీ రన్. యాక్షన్, థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రానికి సినీ విమర్శకులు, ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తున్నది. చిన్న బడ్జెట్ చిత్రంగా వచ్చిన ఈ సినిమా తమిళనాడు బాక్సాఫీస్ వద్ద బెటర్ కలెక్షన్లు రాబడుతున్నది. గత వారం రోజులుగా ఈ చిత్రం నిలకడగా వసూళ్లను రాబట్టడం విశేషంగా మారింది. రన్ బేబీ రన్ సినిమా 7 రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

రన్ బేబీ రన్ కథ ఏమిటంటే?
ప్రాణాలకు ముప్పు తార అనే మెడికల్ స్టూడెంట్ తన లైఫ్‌ను రక్షించుకోవడానికి సత్య అనే బ్యాంక్ ఉద్యోగి జీవితంలోకి వస్తుంది. అప్పటికే సత్యకు మరో అమ్మాయితో ఎంగేజ్‌మెంట్ జరుగుతుంది. తన జీవితంలోకి వచ్చిన తారను సత్య ఎలా ట్రీట్ చేశాడు? తారకు ప్రాణాలకు ఎందుకు ముప్పు ఏర్పడింది? తార వల్ల సత్య, తన కాబోయే భార్య మధ్య ఏమైనా అపోహలు ఏర్పడ్డాయా? చివరకు తార లైఫ్‌కు ముగింపు ఏమిటనే ప్రశ్నలకు సమాధానమే రన్ బే రన్ సినిమా కథ.

రన్ బేబీ రన్‌లో నటీనటులు, సాంకేతిక వర్గం
రన్ బేబీ రన్ సినిమాలో ఆర్జే బాలాజీ, ఐశ్వర్య రాజేష్, ఇషా తల్వార్, రాధిక శరత్ కుమార్, స్మృతి వెంకట్, హరీష్ పెరాడీ, నాగినీడు తదితరులు నటించారు. జియెన్ కృష్ణకుమార్ రచన సహాకారంతోపాటు దర్శకత్వం వహించారు. ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మించారు. ఎస్ యువ సినిమాటోగ్రఫిని, సామ్ సీఎస్ సంగీతం అందించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

తమిళ, కర్ణాటక రాష్ట్రాల్లో కలెక్షన్లు
రన్ బేబీ రన్ సినిమా కేవలం తమిళనాడు, కర్ణాటకలోనే రిలీజైంది. ఈ సినిమా తొలి రోజు 60 లక్షల షేర్, రెండో రోజు 1 కోటికిపైగా షేర్; రెండో రోజు 1.1 కోట్లు, నాలుగో రోజు 50 లక్షలు, ఐదో రోజు 52 లక్షల షేర్, ఆరో రోజు 51 లక్షల షేర్ సాధించింది. దాతో ఈ చిత్రం 4.2 కోట్ల షేర్, 8 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

7వ రోజు రన్ బేబీ రన్ ఆక్యుపెన్సీ
రన్ బేబీ రన్ సినిమా ఆక్యుపెన్సీ వివరాల్లోకి వెళితే.. చెన్నైలో 19 శాతం, బెంగళూరులో 10 శాతం, మధురైలో 36 శాతం, పాండిచ్చేరిలో 37 శాతం, వెల్లూరులో 23 శాతం, త్రివేండ్రమ్‌లో 20 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసింది. మౌత్ టాక్‌తో ఈ సినిమా నిలకడగా వసూళ్లను రాబడుతున్నది.

ఏడు రోజుల్లో
ఇప్పటికే రన్ బేబీ రన్ సినిమా లాభాల్లోకి ప్రవేశించినట్టు తమిళ సినీ ట్రేడ్ నిపుణులు సమాచారం. అయితే 7వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం వారం చివరి రోజున మరో 50 లక్షల వసూళ్లను నమోదు చేస్తుందని ట్రేడ్ రిపోర్టు. దాంతో ఈ చిత్రం 8.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లను నమోదు చేయనున్నది. దాం సక్సెస్‌ఫుల్‌గా రెండో వారంలోకి ప్రవేశించడం విశేషంగా మారింది.


Click it and Unblock the Notifications











