సెక్సీ దుర్గకు చేదు అనుభవం.. కోర్టు ఆదేశాలు తుంగలోకి.. దర్శకుడి ఫైర్..

కేరళ హైకోర్టు ఆదేశించినప్పటికీ సెక్సీ దుర్గ (ఎస్ దుర్గ) చిత్రానికి చేదు అనుభవం తప్పలేదు.

By Rajababu

Recommended Video

సెక్సీ దుర్గకు చేదు అనుభవం.. దర్శకుడి ఫైర్

కేరళ హైకోర్టు ఆదేశించినప్పటికీ సెక్సీ దుర్గ (ఎస్ దుర్గ) చిత్రానికి చేదు అనుభవం తప్పలేదు. భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో (ఇఫీ) ఎస్ దుర్గ చిత్రాన్ని ప్రదర్శించకుండా అడ్డుకోవడంలో కేంద్ర ప్రభుత్వం సఫలైమంది. జ్యూరీ ఎంపిక చేసినా ఎస్ దుర్గ చిత్రాన్ని ఇఫీలో ప్రదర్శించే జాబితా నుంచి తొలగించడం వివాదంగా మారింది. తమ నిర్ణయాన్ని వ్యతిరేకించారన్న కారణంతో జ్యూరీ సభ్యులు రాజీనామా చేయడం తెలిసిందే. కొన్ని వివాదాల మధ్య భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం మంగళవారం (నవంబర్ 29న)తో ముగిసింది.

 కోర్టు ఆదేశాలతో..

కోర్టు ఆదేశాలతో..

ఎస్ దుర్గ చిత్రం వివాదంలో ఇరుక్కోవడంతో చిత్ర దర్శకుడు సనల్‌కుమార్ శశిధరన్ కేరళ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పునిస్తూ ఎస్ దుర్గ చిత్రాన్ని ఇఫీలో ప్రదర్శించాలని ఆదేశించింది. చలన చిత్రోత్సవాలు ముగియడానికి ఒకరోజు ముందు (సోమవారం నాడు) ఇఫీ జ్యూరీ ఆ చిత్రాన్ని వీక్షించింది.

 ఎస్ దుర్గపై ఇఫీ అభ్యంతరం

ఎస్ దుర్గపై ఇఫీ అభ్యంతరం

సినిమా పేరుపై అభ్యంతరాలు తెలుపుతూ ఇఫీ జ్యూరీ సెన్సార్ బోర్డుకు లేఖ రాసింది. దీంతో ఆ చిత్రాన్ని పునఃపరిశీలన నిమిత్తం తమకు పంపాలని కేంద్ర సెన్సార్ బోర్డు మంగళవారం చిత్ర నిర్మాతను ఆదేశించింది. సినిమాపేరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సెన్సార్ బోర్డుకు లేఖ రాసింది.

 ఎస్ దుర్గను ప్రదర్శించవద్దు..

ఎస్ దుర్గను ప్రదర్శించవద్దు..

అధికారుల ఆదేశాలతో ఎస్ దుర్గ చిత్రాన్ని పునఃపరిశీలించేంత వరకు నిర్మాతలు దానిని ఎక్కడా ప్రదర్శించరాదని సెన్సార్‌బోర్డు ఆదేశించింది. సెన్సార్ బోర్డు ఆదేశాల నేపథ్యంలో ఎస్ దుర్గ చిత్రాన్ని చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శించలేకపోతున్నామని పేర్కొంటూ దర్శకుడు సనల్‌కుమార్‌ శశిధరన్‌కు ఇఫీ డైరెక్టర్ సునీత్ టాండన్ లేఖ రాశారు.

 సెన్సార్ నిబంధనల ఉల్లంఘటన

సెన్సార్ నిబంధనల ఉల్లంఘటన

ఎస్ దుర్గ పేరిట సెన్సార్ సర్టిఫికెట్ పొందిన దర్శకుడు ఆ సినిమాను ప్రదర్శించే సమయంలో టైటిట్స్‌లో ఎస్### దుర్గ అని వేశారు. ఇది సెన్సార్ నిబంధనలను ఉల్లంఘించడమేనని బోర్డు తన లేఖలో పేర్కొంది. ఈ పరిణామాలపై చిత్రదర్శకుడు సనల్ స్పందిస్తూ నేటి సమాజంలో మనం ఎదుర్కొంటున్న అసలైన ప్రమాదం ఇదే అని తీవ్రంగా స్పందించారు.

 కేంద్రంపై దర్శకుడి విమర్శలు

కేంద్రంపై దర్శకుడి విమర్శలు

ప్రభుత్వానికి నచ్చని సినిమాను రూపొందిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ దానిని ఎక్కడా ప్రదర్శించే అవకాశం ఇవ్వదు. ప్రభుత్వం కోర్టు తీర్పును సైతం ధిక్కరించేందుకు సిద్ధపడింది. ఎటువంటి సమాచారం లేకుండా ఇఫీ జ్యూరీలో నలుగురు కొత్త సభ్యులను చేర్చి, తన చిత్రాన్ని అడ్డుకొనేలా చేశారు అని దర్శకుడు సనల్ విమర్శించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X