నా స్టయిల్ నాదే...ఎవరినీ కాపీ కొట్టను: రజనీకాంత్
''నేను శివాజీ గణేశన్ కాదు... కమల్‌హాసన్‌ని కూడా కాదు. వాళ్లలా నేను యాక్ట్ చేయలేను. జస్ట్ హీరోగా మాత్రమే చేయగలను. నా స్టయిల్, నా వేగమే నా బలం. నా శరీరంలో ఆ వేగం ఉన్నంతవరకు యాక్ట్ చేస్తానని మాటిస్తున్నా"" అని అభిమానులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు సూపర్ స్టార్ రజనీకాంత్.
ప్రముఖ తమిళ దర్శకుడు ముత్తురామన్ కు 'శంకర రత్న" బిరుదు ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రజనీ పై విధంగా మాట్లాడారు. ముత్తురామన్ నాకు హిట్ సినిమాలు ఇచ్చారనే కారణంతోనే నేను ఆయన దర్శకత్వంలో 25 సినిమాలు చేయలేదు. ఆయన మీద ఉన్న అభిమానంతో అన్ని సినిమాలు చేశాను అని రజనీ వ్యాఖ్యానించారు.
''సింగపూర్‌లో చికిత్స చేయించుకుని చెన్నయ్ వచ్చిన తర్వాత ఇంటిపట్టున ఉండి విశ్రాంతి తీసుకోవడం మొదలుపెట్టాను. ఈ కార్యక్రమానికి కూడా రాకుడా ఉండాలనే అనుకున్నాను. కానీ నా వల్ల కాలేదు. నా కెరీర్ ఎదుగుదలకు దోహదపడిన ముత్తురామన్ శంకర రత్న బిరుదును అందుకోవడం కళ్లారా చూడాలనుకున్నాను, అందుకే వచ్చాను..అంటూ రజనీ వ్యాఖ్యానించారు.
రజనీకాంత్ తాజా సినిమా 'రాణా" త్వరలో ప్రారంభం కానుంది. ఈ సినిమాలో రజనీ సరసన బాలీవుడ్ భామ దీపిక పడుకొను నటిస్తుండగా, కె.ఎస్. రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.


Click it and Unblock the Notifications











