Vijayతో వివాదాలు నిజమే.. లోపలకి కూడా రానివ్వలేదు.. బట్టబయలు చేసిన తండ్రి.. కానీ!
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ ఆయన తండ్రి మధ్య వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గతేడాది విజయ్ తండ్రి ఎస్ .చంద్రశేఖర్ 'ఆలిండియా దళపతి విజయ్ మక్కల్ ఇయ్యకమ్' అనే పేరు మీద రాజకీయ పార్టీని స్థాపించారు. అంతేకాదు కేంద్ర ఎన్నికల కమిషన్ దగ్గర పార్టీని నమోదు కూడా చేశారు. అయితే ఈ విషయంలో వివాదం మొదలైంది. తాజాగా ఈ విషయం మీద చంద్ర శేఖర్ మాట్లాడారు. తనకు తా కొడుకుకు విభేదాలు ఉన్నాయని బయట పెట్టారు. ఆ వివరాల్లోకి వెళితే

రోజు రోజుకూ దూరం
తమిళ్ స్టార్ హీరో దళపతి విజయ్ కు ఆయన తన తండ్రికి రోజు రోజుకి దూరం పెరుగుతోంది. కొద్ది రోజుల నుంచి విజయ్ ఆయన తండ్రి చంద్రశేఖర్ కి మధ్య గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఎందుకంటే ఒకపక్క విజయ్ వరుస సినిమాలతో బిజీగా ఉంటే ఆయన తండ్రి విజయ్ పేరు వాడుకొని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇది విజయ్ కి నచ్చలేదు దీంతో తన తండ్రి చేస్తున్న పనులకు తనకు సంబంధం లేదని ఒక ప్రకటన విడుదల చేసారు ఆయన. నిజానికి విజయ్ తండ్రి 2020లో 'విజయ్ మక్కల్ ఇయక్కం' పేరుతో ఓ సంస్థ ఏర్పాటు చేసి తన పేరు ఉపయోగించుకుని కార్యక్రమాలు చేస్తుండటంతో మొదట్లో మాములుగా చెప్పి చూసాడు విజయ్. అయినా వినకపోవడంతో కొద్ది రోజుల క్రితం విజయ్ ఆయన తల్లి, తండ్రి సహా వారికి సహకరించే పదకొండు మందిపై కోర్టులో కేసు వేశాడు. తనను సంప్రదించకుండా తన పేరుతో రాజకీయ పార్టీ పెట్టడం కరెక్ట్ కాదని, తన పేరును, ఫోటోలు వాడద్దని కేసులో పేర్కొన్నారు.

మేమేప్పుడో రద్దు చేశాం
తాజాగా దీనిపై విచారణ జరగగా అసలు 'విజయ్ మక్కల్ ఇయక్కం'ను రద్దు చేసినట్టు చంద్రశేఖర్ సమాధాన పిటిషన్ దాఖలు చేశారు. ఫిబ్రవరి 28, 2021 న విజయ్ పీపుల్స్ ఫోరమ్‌లో జనరల్ బాడీ సమావేశం జరిగిందని, ఈ సమావేశంలో ఎగ్జిక్యూటివ్‌లు సెహగర్, జగన్, భారతి దాసన్, శోబా మరియు మహేశ్వరన్ తమ ప్రాథమిక పదవులకు రాజీనామా చేసినట్లు ఆయన చెప్పారు. ఈ సమావేశంలో, విజయ్ పీపుల్స్ మూవ్‌మెంట్ రద్దు చేయడానికి ఒక తీర్మానం ఆమోదించబడిందని, ప్రస్తుతం విజయ్ పీపుల్స్ మూవ్‌మెంట్ లేదని ఆయన అన్నారు. ఇక కేసును అక్టోబర్ 29 కి వాయిదా వేసింది. ఇక కొడుకుతో తనకు విభేదాలు ఉన్నాయనే విషయాన్ని చంద్రశేఖర్ ఒప్పుకున్నారు. విజయ్ మరియు నాకు సమస్య ఉన్నది నిజమే అని దర్శకుడు S.A. చంద్రశేఖర్ అన్నారు.

కొడుకుని హీరోను చేసి
అయితే విజయ్ తల్లి శోబా మాత్రం విజయ్‌తో ఎలాంటి సమస్య లేదని వీడియోలో చెప్పింది. ఇక ఒక తమిళ వారపత్రికలో ప్రచురించబడిన ఇంటర్వ్యూలో, చంద్ర శేఖర్ తాను, తన భార్య విజయ్ ఇంటి బయట కారులో వేచి ఉన్నామని, విజయ్ తన తల్లి శోభను మాత్రమే ఇంటి లోపలకి పిలిచాడని చంద్రశేఖర్ చెప్పారు. డైరెక్టర్ గా ఉన్న ఎస్. ఎ. చంద్రశేఖర్ తన కుమారుడు విజయ్‌ను తమిళ చిత్రసీమలో పరిచయం చేశారు. అతను విజయవంతమైన హీరో కావడానికి అతని తండ్రి SA చంద్రశేఖర్ కారణం అని చెప్పాలి. విజయ్ తండ్రి చంద్రశేఖర్ విజయ్ కోసం అభిమాన సంఘాన్ని ప్రారంభించడం మొదలు దాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి ముఖ్యమైన పాత్ర పోషించారు. సినీరంగంలో ఉన్న తన కుమారుడిని రాజకీయాల్లోకి తీసుకురావాలని కోరుకుంటూ, చంద్రశేఖర్ జనరల్ విజయ్ పీపుల్స్ మూమెంట్ అనే పార్టీని ఎన్నికల కమిషన్‌లో నమోదు చేసుకున్నారు.

అలా మొదలయింది
డైరెక్టర్ చంద్రశేఖర్ మరియు కోశాధికారి శోభ సహా కార్యనిర్వాహకుల పేర్లు విజయ్ పీపుల్స్ మూవ్‌మెంట్ నాయకుల పేర్లుగా ప్రకటించబడ్డాయి. అలా ప్రకటించినప్పుడే గందరగోళం ఏర్పడింది. పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని విజయ్ చెప్పాడు. విజయ్ తన తండ్రికి విధేయులుగా ఉన్న పార్టీ కార్యనిర్వాహకులను తొలగించి కొత్త కార్యనిర్వాహకులను నియమించారు. కుటుంబ కలహాలు రోడ్డు ఎక్కడంతో గొడవ పెరిగింది. చంద్రశేఖర్ తన ట్విట్టర్ లో ఒక వీడియోను పోస్ట్ చేశారు. చంద్రశేఖర్ తన కుమారుడు విజయ్‌తో సమస్య ఉన్న మాట వాస్తవమేనని చెప్పారు. ఇటీవల తనను ఇంటర్వ్యూ చేసిన ఒక తమిళ వారపత్రిక తప్పుడు సమాచారాన్ని ప్రచురించిందని పేర్కొన్నారు.
Recommended Video

అందులో తప్పుగా రాశారు
ఆ ఇంటర్వ్యూలో నేను చెప్పని విషయం ఉందని అదేంటంటే ఆ వీడియోలో శోభా మరియు నేను విజయ్ ఇంటి వెలుపల వేచి ఉన్నామని చెప్పామని, అయితే విజయ్ శోబాను లోపలికి రమ్మని మాత్రమే చెప్పారు అని అన్నారు . నేను శోభ మరియు నేను విజయ్ ని కలవకుండానే తిరిగొచ్చామన్నది నిజం కాదని నేను స్పష్టం చేయాలనుకుంటున్నానన్నా ఆయన నేను విజయ్ ను కలవడంలో కొన్ని సమస్యలు ఉన్నాయి కానీ, విజయ్ మరియు శోభ మధ్య ఎలాంటి చేదు లేదు. ఇద్దరూ తరచూ మాట్లాడుకుంటూ కలుస్తుంటారు. వారిద్దరూ సంతోషంగా ఉన్నారని చంద్రశేఖర్ వీడియోలో చెప్పారు. తండ్రి మరియు కొడుకులకు సమస్యలు ఉన్నాయనేది నిజం అని S.A. తన వీడియో ద్వారా పోస్ట్ చేయడం సంచలనంగా మారింది.


Click it and Unblock the Notifications











