సచిన్‌పై ధనుష్ పాట విడుదల

By Bojja Kumar

'వై దిస్ కొలవెరి' అంటూ దేశం మొత్తాన్ని తన పాటతో ఓ ఊపు వూపిన తమిళ హీరో ధనుష్ తాజాగా సచిన్‌పై రూపొందించిన పాటను ఈ రోజు(ఫిబ్రవరి 8) విడుదల చేశాడు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా వెల్లడించిన ధనుష్ అందుకు సంబంధించిన యూట్యూబ్ లింకును అందులో పోస్టు చేశాడు. కొలవెరి పాటకు సంగీతం అందించిన అనిరుధ్ రవి చందర్ ఈ పాటకు సంగీతం సమకూర్చాడు. ఇందులో ధనుష్ తో పాటు, హాట్ బ్యూటీ అనుష్క కూడా దర్శనం ఇస్తుండటం గమనార్హం. తాను సచిన్ కు వీరాభిమానిని అని, ఆ కోణంలోనే పాటకు ప్లాన్ చేశామని ధనుష్ చెప్పుకొచ్చాడు.

రామోజీ ఫిల్మ్ సిటీలోని రైల్వే స్టేసన్ సెట్‌లో ఈ పాటను చిత్రీకరించారు. కొలవెరి సాంగుకు యూట్యూబ్ లో భారీ రెస్సాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో సచిన్ రూపొందించిన ఈ పాటకు ఏ రేంజ్‌లో హిట్టవుతుందో అని అతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 'One plus one two-u two-u, if not sachin who-u who-u!!!" అంటూ ఈ సాంగు సాగుతుంది. తన భార్య ఐశ్వర్య దర్శకత్వంలో రాబోతున్న '3' సినిమాకుగాను 'కొలవెరి' అనే పాటను రాసి, దాన్ని స్వయంగా పాడిన విషయం తెలిసిందే. సూపర్ పాపులర్ అయిన ఈ సాంగు అతితక్కువ కాలంలో కోట్లాది క్లిక్స్ తో మోస్ట్ వ్యూవుడ్(గోల్డ్) లిస్టులో చేరింది

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X