సదా కొత్త ఎసైన్మెంట్!
కొత్త సంవత్సరం బాష్ లో సదా ప్రత్యేక ఆకర్షణ కానున్నది. హైదరాబాద్ లో మాత్రం కాదు. చెన్నయ్ కంట్రీ క్లబ్ వారు నిర్వహించే కార్యక్రమంలో సదా తన డాన్స్ తో జనాలను ఆనందింపచేయనున్నది. కంట్రీ క్లబ్ నూతన 2008వ సంత్సర ప్రారంభోత్సవ కార్యక్రమాలను భారీ ఎత్తున జరపడానికి నిశ్చయించింది. ఇందుకోసం సదా, మలైకా అరోరా, నెహా దుపియా, రిమీ సేన్, అమృతా అరోరా, మహిమా చౌదరీ, ఉదితా గోస్వామీ, ఉషా ఉతప్ లతో ఒప్పందాలు కుదుర్చుకుంది. వీరంతా దేశవ్యాప్తంగా ఉన్న కంట్రీ క్లబ్ లలో ఒక్కో క్లబ్ లో ఒకరుగా పాల్గొననున్నారు. అందులో భాగంగా సదా చెన్నయ్ కంట్రీ క్లబ్ కు ఎంపికయింది.


Click it and Unblock the Notifications











