twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘శకుని’లో కార్తీ క్యారెక్టరేంటి?

    By Srikanya
    |

    కార్తీ హీరోగా ఎన్.శంకర్‌దయాళ్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన చిత్రం 'శకుని'. పొలిటికల్ సెటైర్ గా రూపొందిన ఈ చిత్రంలో కార్తీ ఓ గ్రామం నుంచి చెన్నైకు వచ్చి అనుకోని పరిస్దితుల్లో రాజకీయాల్లోకి ప్రవేశించే పాత్ర ను పోషిస్తున్నట్లు తెలుస్తోంది. నెగిటివ్ షేడ్స్ తో చిత్రం నడిచినా చివరకు అదంతా ప్రజల మంచి కోసమే చేసే పాత్రగా రాజకీయాలపై వ్యంగ్య బాణంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారని తెలుస్తోంది. స్డూడియో గ్రీన్ సమర్పణలో శ్రీ సాయిగణేష్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తోన్న చిత్రం 'శకుని'. ప్రణీత హీరోయిన్ గా రూపొందిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈ నెల 22న విడుదలకు సిద్ధమవుతోంది.

    హీరో కార్తీ చిత్రం కథ గురించి చెపుతూ...'శకుని అంటే దుష్ట ఆలోచనలే అనుకోవద్దు. ఓ సమస్య నుంచి తెలివిగా ఎలా బయటపడాలో అతనికి బాగా తెలుసు. ప్రజాస్వామ్యంలో శకుని స్వభావం ఉన్నవాళ్లు చాలామంది కనిపిస్తుంటారు. ప్రస్తుతం మధ్యవర్తులు లేకపోతే... ఏ పనీ జరగడం లేదు. లంచం ఇవ్వకపోతే ఫైలు కదలడం లేదు. ఈ వాతావరణంలో ఓ యువకుడు శకునిలా తన పనులను చక్కబెట్టుకొన్నాడు అనేదే 'శకుని'చిత్రం స్టోరీ లైన్. 'శకుని' తన కెరీర్‌లోనే భిన్నమైన సినిమా అని, ఇందులో హీరో కేరక్టరైజేషన్ భిన్నంగా ఉంటుందని, ఆవారా, నా పేరే శివ చిత్రాల స్థాయి విజయాన్ని ఈ సినిమా దక్కించుకుంటుందని కార్తీ అంటున్నారు.

    'సమకాలీన రాజకీయాల్ని ప్రక్షాళనం చేయాలన్న తపన వున్న యువకుడతను. రాజకీయ వైకుం అతను వేసే పాచికలు ఆ యువకుడి రాజకీయ ప్రస్థానాన్ని ఎలాంటి మలుపు తిప్పాయి? అతను చేసిన శకుని రాజకీయం వ్యవస్థలో ఎలాంటి మార్పులు తీసుకువచ్చిందో 'శకుని' చిత్రంలో చూడాల్సిందే అన్నారు నిర్మాత బెల్లంకొండ సురేష్. ఈ సందర్భంగా బెల్లకొండ సురేష్ మాట్లాడుతూ 'ఓ సాధారణ యువకుడి రాజకీయ ప్రస్థానమే ఈ చిత్రకథ. రాజకీయ అందలాల్ని అందుకోవడానికి ఆ యువకుడు వేసే ఎత్తులు ప్రత్యర్థుల్ని విస్మయానికి గురిచేస్తూ వుంటాయి.

    స్క్రీన్‌ప్లే ప్రధానంగా సాగే ఈ చిత్రంలో ప్రతి సన్నివేశం ఆసక్తికరంగా వుంటుంది. కార్తీ సరికొత్త పాత్రలో ఆకట్టుకుంటాడు. గత చిత్రాలకు భిన్నంగా ఆయన పాత్ర చిత్రణ వుంటుంది. జి.విపకాష్‌కుమార్ చక్కటి సంగీతం అందించాడు. ఇటీవల విడుదలైన పాటలకు శ్రోతల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. దర్శకుడు కొత్తవాడైనా అద్భుతంగా చిత్రాన్ని తెరకెక్కించాడు' అన్నారు. సంతానం, రాధిక, రోజా, కోట శ్రీనివాససరావు, నాజర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోక్షిగఫీ: పి.జి.ముత్తయ్య, ఆర్ట్: రాజమీవన్, ఫైట్స్: అనల్ అరసు, ఎడిటర్: శ్రీకరవూపసాద్, మాటలు: శశాంక్ వెన్నెలకంటి, పాటలు: సాహితి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: బి.మహేంవూదబాబు, నిర్మాతలు: బెల్లకొండ సురేష్, బెల్లకొండ గణేష్‌బాబు.

    English summary
    Saguni' is Karthi's forthcoming political satire which marks the debut of director Shankar Dayal. "Karthi, after facing tussles in his village, moves to Chennai where certain circumstances lead him to opt for politics. Karthi's character has negative shades in the film, but in the end, he does it all for the good of the society", express sources in the know. In fact, it is said that his character, at certain portions will remind one of corporate lobbyist Nira Radia, of 2G spectrum scam.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X