వైరల్ వీడియో : హీరోయిన్ స్టంట్స్ చూసి ఆశ్చర్యపోతున్న ఫ్యాన్స్!
'కబాలి' మూవీలో రజనీకాంత్ కూతురుగా నటించిన తర్వాత తమిళనటి సాయి ధన్సిక సౌత్‌లో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఈ మూవీలో ఆమె యాక్షన్ల సీన్లతో అదరగొట్టారు. ఆ తర్వాత నుంచి వరుసగా అలాంటి పాత్రలే దక్కించుకుంటూ దూసుకెళుతున్నారు.
తాజాగా ధన్సికకు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫిట్‌నెస్ విషయంలో ఆమె ఎంత కేర్ తీసుకుంటారో... యాక్షన్ సీన్స్ చేయడానికి అనుగణంగా ఆమె తన బాడీని ఎలా మౌల్డ్ చేస్తున్నారో, అందుకోసం ఎంతలా కష్టపడతారో ఈ వీడియో స్పష్టం చేస్తోంది. ఆమె ఆగకుండా పల్టీల కొట్టడం చూసి ఫ్యాన్స్ ఆశ్చర్య పోతున్నారు.

తమిళనాడులోని తంజావూరుకు చెందిన ధన్సిక... 2006లో 'తిరుది' అనే సినిమా ద్వారా తమిళ సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. 'కబాలి' తర్వాత ఆమె దశ తిరిగింది. ఆ మరుసటి ఏడాది 5 చిత్రాల్లో అవకాశం దక్కించుకుంది.
ప్రస్తుతం ధన్సిక 'కిత్నా' అనే చిత్రంలో నటిస్తున్నారు. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని తమిళం, తెలుగు, మలయాళం, కన్నడలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీంతో పాటు యోగిదా, వాలుజడ, ఇరుట్టు చిత్రాల్లో నటిస్తున్నారు.
ధన్సిక తమిళంతో పాటు ఇతర భాషల్లో కూడా అవకాశాలు దక్కించుకునే ప్రయత్నం చేస్తోంది. 'కిత్నా’ చిత్రం సౌత్ భాషలన్నింటిలో విడుదలవుతున్న నేపథ్యంలో ఈ మూవీ తర్వాత మరిన్ని అవకాశాలు వస్తాయనే నమ్మకంతో ఉంది.


Click it and Unblock the Notifications











