'ఐ లవ్ యూ' చెప్పాలనుకున్న హీరోతోనే!: సాయి పల్లవి కల నెరవేరిన వేళ..

స్క్రీన్‌పై సాయిపల్లవి చలాకీతనం చూస్తే ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే. తెరపై ఆమె బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ అంతలా కట్టిపడేస్తాయి. ప్రేమమ్‌తో తెరంగేట్రం చేసిన ఈ టాలెంటెడ్ గర్ల్.. అనతి కాలంలోనే అటు తమిళ, మలయాళ.. ఇటు తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా సూర్య హీరోగా నటిస్తున్న చిత్రంలోను ఛాన్స్ దక్కించుకోవడం విశేషం.

Recommended Video

Sai Pallavi Says 'No To Star Hero' స్టార్ హీరో తో నటించనన్న సాయి పల్లవి

 సూర్య-36:

సూర్య-36:

తమిళంలో సూర్య నటిస్తున్న 36వ చిత్రంలో హీరోయిన్ పాత్ర కోసం సాయిపల్లవిని సంప్రదించారు చిత్ర యూనిట్. తన ఫేవరెట్ యాక్టర్ సూర్యతో సినిమా అనేసరికి.. సాయిపల్లవి మరో మాట లేకుండా ఓకె చేసేశారట.

సాయిపల్లవి పాత్ర ఎలా ఉంటుందో:

సాయిపల్లవి పాత్ర ఎలా ఉంటుందో:

సాధారణంగానే సూర్య సినిమాల్లో హీరోయిన్ల పాత్రకూ ప్రాధాన్యత ఉంటుంది. కేవలం కథనంతా హీరో చుట్టూ తిప్పడం కాకుండా.. హీరోయిన్ పాత్ర కూడా ఆకట్టుకునేలా ఉంటుంది. ఇక సహజంగానే తనదైన నటనతో మెప్పించే సాయిపల్లవికి.. సూర్య సినిమాలో ఎలాంటి ప్రాధాన్యత ఉన్న పాత్ర లభిస్తుందో చూడాలి.

ఐ లవ్ యూ చెప్పాలనుకున్న హీరోతోనే:

ఐ లవ్ యూ చెప్పాలనుకున్న హీరోతోనే:

తన అభిమాన నటుడు తమిళ స్టార్ సూర్య అని సాయి పల్లవి గతంలో చాలాసార్లు చెప్పారు. ఆయన్ను కలిస్తే.. 'ఐ లవ్ యూ' చెబుతానని కూడా అన్నారు. ఇప్పుడు అదే నటుడితో స్క్రీన్ షేర్ చేసుకోవాల్సి రావడం నిజంగా సాయి పల్లవి ఎగిరి గంతేసే విషయమే.

సంక్రాంతికి సెట్స్ పైకి:

సంక్రాంతికి సెట్స్ పైకి:

డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై సూర్య 36వ సినిమా తెరకెక్కుతోంది.

ఎస్‌.ఆర్‌. ప్రభు నిర్మించనున్న ఈ చిత్రానికి సెల్వరాఘవన్‌ దర్శకత్వం వహించనున్నారు. సంక్రాంతికి ఈ చిత్రం ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

 సెల్వ రాఘవన్ ఎలాంటి 'కథ'తో:

సెల్వ రాఘవన్ ఎలాంటి 'కథ'తో:

సెల్వ రాఘవన్ గతంలో 7/జి బృందావన కాలనీ, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, యుగానికొక్కడు, వర్ణ చిత్రాలతో తెలుగులోను మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వర్ణ చిత్రం ఫెయిల్యూర్ తర్వాత వస్తున్న చిత్రం కావడంతో.. సూర్యతో ఆయన ఎలాంటి కథను తెరకెక్కించబోతున్నారది ఆసక్తికరంగా మారింది.

తమిళంలో మూడో సినిమా:

తమిళంలో మూడో సినిమా:

సూర్యతో సాయిపల్లవి చేయబోతున్న తాజా చిత్రం తమిళంలో ఆమెకు మూడో సినిమా. అంతకుముందు 'కరు', ధనుష్ తో 'మారి 2' వంటి చిత్రాల్లో ఆమె నటించారు.

 వరుస అవకాశాలు:

వరుస అవకాశాలు:

2015లో ప్రేమమ్ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన సాయిపల్లవి.. ఆ తర్వాత 'కాలి'తో మరో హిట్ దక్కించుకున్నారు. ఇక ఈ ఏడాది తెలుగులోను 'ఫిదా' చేసే హిట్ తో ఇక్కడ కూడా వరుస అవకాశాలు దక్కించుకుంటున్నారు. సాయిపల్లవి నటించిన తాజా తెలుగు చిత్రం ఎంసీఏ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X