సాయిపల్లవికి షాక్.. ఆ సినిమా నుంచి అవుట్.. మళ్లీ అవే రూమర్లు..
Recommended Video

ప్రేమమ్‌తో దక్షిణాది ప్రేక్షకుల హృదయాలను దోచుకొన్న సాయిపల్లవి.. ఆ తర్వాత ఫిదా చిత్రంతో తెలుగు ప్రేక్షకులను తన నటనతో కట్టిపడేశారు. ఆ తర్వాత దిల్ రాజు బ్యానర్‌లో నానితో కలిసి ఎంసీఏ చిత్రంలో నటించారు. తమిళంలో కణం సినిమాలో నాగశౌర్యతో నటించి మెప్పించారు. అయితే నటనపరంగా ఎలాంటి మచ్చలేని సాయిపల్లవిపై మరో రకమైన ఆరోపణలు రోజుల రోజుకు పెరిగిపోతున్నాయి.

నానితో కూడా
ఎంసీఏ సినిమా సందర్భంగా నానితో వ్యక్తిగత అభిప్రాయ బేధాలు వచ్చాయని మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే నాని ఓ దశలో సాయిపల్లవితో ఎలాంటి గొడవలు లేవు. నాతోపాటు నటించిన నా హీరోయిన్లలో సాయిపల్లవి మంచి ప్రతిభావంతురాలు. మా మధ్య గొడవలు వచ్చినట్టు వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు అని నాని క్లారిటీ ఇచ్చారు.

నాగశౌర్య విమర్శలు
ఇక కణం సినిమాలో నటించిన నాగశౌర్య.. సాయిపల్లవిపై బహిరంగంగా ప్రముఖ టెలివిజన్ ఛానెల్లో విమర్శలు చేశారు. సాయిపల్లవి చాలా పొగరుగా వ్యవహరిస్తుంది. ఆమెతో నటించేటప్పుడు చాలా ఇబ్బందికి గురయ్యాను అని నాగశౌర్య అన్నారు. అంతేకాకుండా నేను ఎంతోమంది హీరోయిన్లతో నటించాను. కానీ ఆమె లాంటి ప్రవర్తన కలిగిన వ్యక్తిని ఇంతవరకు చూడలేదు అని నాగశౌర్ పేర్కొన్నారు.

సాయిపల్లవికి మళ్లీ దెబ్బ
కెరీర్‌కు ఇబ్బందిగా మారే విమర్శలు ఎదుర్కొంటున్న సమయంలో సాయిపల్లవికి మరో ఎదురుదెబ్బ తగిలింది. తమిళంలో ప్రముఖ దర్శకుడు భాగ్యరాజా కుమారుడు శంతను భాగ్యరాజా ఓ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో సాయిపల్లవి, నిత్యమీనన్ నటిస్తున్నట్టు వార్తలు వచ్చాయి.

సాయిపల్లవి స్థానంలో సమంత అక్కినేని
అయితే శంతను రూపొందించే చిత్రం నుంచి సాయిపల్లవిని తప్పించారనే న్యూస్ లేటేస్టుగా మీడియాలో వైరల్‌గా మారింది. సాయిపల్లవి స్థానంలో సమంత అక్కినేనిని తీసుకొన్నట్టు తెలుస్తున్నది. ఈ వార్తను అధికారికంగా ధృవీకరించిన దాఖలాలు కనిపించడం లేదు.

ప్రవర్తనే ప్రధాన కారణమని
సాయిపల్లవిని తప్పించడానికి ప్రధాన కారణం ఆమె ప్రవర్తనే అనే మాట మీడియాలో వినిపిస్తున్నది. ఆమె వ్యవహరించే తీరు నచ్చకపోవడం వల్లనే సమంతను ప్రాజెక్ట్‌లోకి తీసుకొన్నట్టు సమాచారం. అయితే ఈ నిరాధారమైన వార్త గురించి ఎవరైనా స్పందిస్తే అసలు విషయం బయటపడుతుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు మిస్కిన్ నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











