2 కోట్ల డీల్ రిజెక్ట్ చేసిన సాయి పల్లవి.. ఎందుకో తెలుసా!
Recommended Video
ఫిదా చిత్రం తర్వాత సాయి పల్లవి క్రేజీ టాలీవడ్‌లో అమాంతం పెరిగింది. కేవలం నటన, అభినయంతోనే సాయి పల్లవి యువతకు బాగా చేరువైంది. అందరిలా గ్లామర్ పాత్రలు చేయకున్నా సాయి పల్లవి సౌత్ లో స్టార్ హీరోయిన్ గా మారడం విశేషం. సాయి పల్లవి చివరగా నటించిన తెలుగు చిత్రం పడిపడి లేచే మనసు. ఈ చిత్రం నిరాశపరిచింది. ప్రస్తుతం సాయి పల్లవి కొన్ని తమిళ చిత్రాల్లో నటిస్తోంది. తాజాగా సాయి పలలవి 2 కోట్ల డీల్ వదులుకుందనే వార్త హాట్ టాపిక్‌గా మారింది.

నటనతోనే
సాధారణంగా యువతని హీరోయిన్ల గ్లామర్ ఆకర్షిస్తుంటుంది. సాయి పల్లవికి యువతలో ఫాలోయింగ్ ఎక్కువ. సాయి పల్లవి నటన వల్లే యువతలో ఆమెకు అంత క్రేజ్ ఏర్పడింది. తెలుగులో సాయి పల్లవి నటించిన తొలి చిత్రం ఫిదా తోనే ఏ మలయాళీ హీరోయిన్ అందరిని మాయ చేసింది. తనకు ఎంత క్రేజ్ పెరిగినా సాయి పల్లవి మాత్రం వెండితెరపై గ్లామర్ విషయంలో హద్దుకు పాటించింది.

2 కోట్ల డీల్
ఇదిలా ఉండగా సాయి పల్లవి క్రేజ్ గమనించిన కార్పొరేట్ సంస్థలు ఆమెని తమ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉపయోగించుకోవాలని భావించాయి. ఇటీవల ఓ కాస్మొటిక్ బ్రాండ్ సంస్థ తాము లాంచ్ చేయబోయే కొత్త పేస్ క్రీమ్ ఉత్పత్తికి సాయి పల్లవిని బ్రాండ్ అంబాసిడర్ గా అనుకున్నారట. ఆ సంస్థ ప్రతినిధులు 2 కోట్ల క్రేజీ ఆఫర్ తో సాయి పల్లవిని సంప్రదించినట్లు తెలుస్తోంది. కానీ సాయి పల్లవి మాత్రం వారికి ఊహించని షాక్ ఇచ్చిందంట.

సినిమాల్లోనే మేకప్ వేసుకోను
తనకు ఎంత పారితోషికం ఇచ్చినా బ్రాండ్ అంబాసిడర్ గా ఉండలేనని సాయి పల్లవి వారితో తెలిపింది. సినిమాల్లోనే తాను మేకప్ లేకుండా మొటిమలతో నటిస్తాను. అలాంటప్పుడు లేని అందం ఉన్నట్లుగా చూపించి జనాలని మోసం చేయలేనని సాయి పల్లవి తన అభిప్రాయం తెలిపినట్లు తెలుస్తోంది. సాయి పల్లవి నేచురల్ లుక్ తోనే అందంగా కనిపించడానికి ఇష్టపడుతుంది. అందుకే సాయి పల్లవి ఎప్పడూ ఓవర్ మేకప్ వేసుకుని కనిపించదు.

వరుస చిత్రాలతో
సాయి పల్లవి ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ఎన్ జి కె. సూర్య నటిస్తున్న ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. సాయి పల్లవి నటించిన పడిపడి లేచే మనసు చిత్రం గత ఏడాది డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎమోషనల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఆ చిత్రం ప్రేక్షకులని మెప్పించలేకపోయింది. తెలుగులో కొన్ని చిత్రాల్లో సాయి పల్లవికి అవకాశాలు వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











