twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సాయి పల్లవి పెళ్లి ఫొటో వైరల్.. ఎక్కడ.. ఎప్పుడంటే..

    సాయి పల్లవి పెళ్లి జరిగింది నిజంగా కాదు.. అది సినిమా వివాహం.. జరిగింది మాత్రం నాగశౌర్యతో.. తమిళ చిత్రం కరు కోసం. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదలై విశేషంగా ఆకట్టుకొంటున్నది.

    By Rajababu
    |

    Recommended Video

    సాయి పల్లవి పెళ్లి ఫొటో వైరల్

    సాయి పల్లవి పెళ్లి జరిగింది నిజంగా కాదు.. అది సినిమా వివాహం.. జరిగింది మాత్రం నాగశౌర్యతో.. తమిళ చిత్రం కరు కోసం. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదలై విశేషంగా ఆకట్టుకొంటున్నది. ఆ చిత్రంలో జరిగిన నాగశౌర్య, సాయి పల్లవి పెళ్లి ఫోటోలు చర్చనీయాంశమయ్యాయి.

    నాగశౌర్యతో సాయిపల్లవి హారర్ చిత్రం

    నాగశౌర్యతో సాయిపల్లవి హారర్ చిత్రం

    ప్రేమమ్ మలయాళ చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచమైన సాయి పల్లవి.. ఆ తర్వాత ఫిదా చిత్రంతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది. ప్రస్తుతం నానితో ఎంసీఏ చిత్రంలో నటిస్తున్నది. తమిళంలో నాగశౌర్యతో నటించిన హారర్ చిత్రం విడుదలకు సిద్ధమవుతున్నది. ధనుష్తో మారి2 చిత్రంలో కూడా నటిస్తున్నది.

    అబార్షన్ కథా నేపథ్యంగా

    అబార్షన్ కథా నేపథ్యంగా

    అబార్షన్, భ్రూణ హత్యల కథాంశంతో కరు చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా రూపొందించింది. ఈ చిత్రంలో సాయి పల్లవి ఆధునిక యువతిగా కనిపించిది. ఆమె పాత్ర తీరు ఆకట్టుకునేలా, ఉద్వేగభరితంగా కనిపిస్తున్నది. కరు చిత్రానికి విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. సీఎస్ సామ్ సంగీతం అందించారు.

    నాలుగేళ్ల కూతురికి తల్లిగా

    నాలుగేళ్ల కూతురికి తల్లిగా

    ఓ తల్లి, నాలుగేళ్ల కూతురు మధ్య ఉండే బంధం, భావోద్వేగాల సమ్మేళనమే కరు సినిమా కథ. నాలుగేళ్ల కూతురుకు సాయి పల్లవి తల్లిగా నటిస్తుందనే తాజా సమాచారం. ఈ చిత్రంలో తల్లి పాత్రకు సాయిపల్లవి మాత్రమే సరిపోతుందని భావించాం. ఆమె తప్ప మరొకరు చేయలేరనేది మా అభిప్రాయం అని దర్శకుడు విజయ్ పేర్కొన్నారు.

    తమిళంలోకి సాయి పల్లవి ఎంట్రీ

    తమిళంలోకి సాయి పల్లవి ఎంట్రీ

    గతంలో జయరాం, పద్మప్రియ నటించిన కన కన్మనీ చిత్ర కథ మాదిరిగా కరు ఉందనే ఫిర్యాదులు వస్తున్నాయి. కరు చిత్రంలో సాయి పల్లవి, నాగశౌర్య జంట చాలా ప్రెష్‌గా కనిపిస్తున్నది. తమిళంలో సాయిపల్లవికి ఇదే తొలి సినిమా.

    English summary
    Sai Pallavi’s acting prowess has impressed critics and audiences immensely in her short career. The trailer of her upcoming Tamil film Karu was unveiled recently. Naga Shourya who is known for his work in Telugu films. The premise that runs through the film is that of abortion. Sai plays a contemporary young woman in the film and is looking nice. It is directed by AL Vijay and made by Lyca Productions. The music is by Sam CS.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X