ప్రముఖ దర్శకుడి కుమారుడితో నిత్యా మీనన్, సాయిపల్లవి!
విలక్షణ నటీమణులు సాయి పల్లవి, నిత్యామీనన్ ఓకే చిత్రంలో నటించే అవకాశం కనిపిస్తున్నది. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు భాగ్యరాజ్ కుమారుడు శంతను భాగ్యరాజ్ దర్శకత్వం వహించనున్నారనే వార్త మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నది. ఈ మేరకు నిర్మాత రవీంద్రన్ చంద్రశేఖరన్, సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్, దర్శకుడు మిస్కిన్‌తో కలిసి దిగిన ఫొటో శంతను భాగ్యరాజ్ షేర్ చేయడం ప్రాధాన్యం సంతరించుకొన్నది.
సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్న ప్రకారం ఈ చిత్రంలో సాయి పల్లవి, నిత్యామీనన్ నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. దర్శకుడు మిస్కిన్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తారని తెలుస్తున్నది. ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. మిస్కిన్, పీసీ శ్రీరాం సార్‌తో కలిసి పనిచేయడం గొప్ప అదృష్టం అని శంతను అన్నారు.



Click it and Unblock the Notifications











