నా వల్ల ఒక్క సీన్ కోసం 50 టేకులు.. ఆయన మిలియన్‌లో ఒక్కడు.. సాయి పల్లవి!

Recommended Video

Sai Pallavi Praises Surya In NGK Movie Trailer Launch || Filmibeat Telugu

సూర్య నటిస్తున్న తాజా చిత్రం ఎన్జీకే. ఎన్జీకే అంటే నంద గోపాల్ కృష్ణ. ఈ చిత్రం సూర్య పాత్ర పేరు అదే. సీనియర్ దర్శకుడు సెల్వరాఘవన్ ఈ చిత్రాన్ని తెరకెక్కితున్నారు. మే 31న ఎన్జీకే చిత్రాలు తెలుగు తమిళ భాషలో విడుదల చేసేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయి. సోమవారం రోజు ఎన్జీకే చిత్ర ట్రైలర్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. మాస్ పొలిటికల్ లీడర్ పాత్రలో సూర్య అదరగొడుతున్నాడు. ప్రస్తుత రాజకీయ వ్యవస్థపై పోరాటం చేసే వ్యక్తిగా సూర్య ఈ చిత్రంలో నటిస్తున్నాడు. సాయి పల్లవి, రకుల్ ప్రీత్ సింగ్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ట్రైలర్ లాంచ్ సందర్భంగా సాయిపల్లవి సూర్యపై ప్రశంసలు కురిపించింది.

మిలియన్‌లో ఒక్కరు

మిలియన్‌లో ఒక్కరు

సూర్య మిలియన్ లో ఒక్కరని సాయి పల్లవి ప్రశంసలు కురిపించింది. డ్రీమ్ వారియర్స్ సంస్థ నిర్మిస్తున్న ఎన్జీకే చిత్రంలో సాయి పల్లవి తొలిసారి సూర్య సరసన నటిస్తోంది. ఈ చిత్రంలో సాయి పల్లవి సూర్య భార్య పాత్రలో నటిస్తోంది. సూర్య సర్ కు నేను వీరాభిమానికి. షూటింగ్ లో ఆయన్ని ఎక్కువగా గమనించే దాన్ని. అందువల్ల ఆయన ఇబ్బందిపడి ఉంటారు. సెట్స్ లో సూర్య అందరితో మెలిగే విధానం, షాట్ కు సిద్ధమ్మయ్యే విధానం ఇలా ప్రతి అంశాన్ని గమనించేదాన్ని అని సాయి పల్లవి తెలిపింది.

20 ఏళ్ళు పనిచేసినా

20 ఏళ్ళు పనిచేసినా

సూర్య సర్ సెట్స్ లో టెక్నీషియన్లందరితో ప్రేమగా మాట్లాడుతారు. వారి కుటుంబ సభ్యుల బాగోగులు కూడా తెలుసుకుంటారని సాయి పల్లవి తెలిపింది. ఆయన పాత్రలో ఒదిగిపోయి నటిస్తారు. నేను 20 ఏళ్ళు పనిచేసినా సూర్య పడ్డ కష్టంలో సంగం కూడా చేయలేను అని సాయి పల్లవి సూర్యపై ప్రశంసల వర్షం కురిపించింది. అలాంటి వ్యక్తితో కలసి నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని సాయి పల్లవి తెలిపింది.

ఒక్క సీన్ కోసం 50 టేకులు

ఒక్క సీన్ కోసం 50 టేకులు

నా వాళ్ళ ఎన్జీకే చిత్రంలో ఓ సన్నివేశం కోసం దాదాపు 50 టేకులు అవసరం అయ్యాయని సాయి పల్లవి తెలిపింది. అయినా కూడా సూర్య విసుగుచెందలేదు. చాలా ఓపిగ్గా ఉంటూ నేను ఇబ్బంది పడకుండా చూసుకున్నారు అని సాయి పల్లవి తెలిపింది. ఈ చిత్రంలో మరో కీలక పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ కూడా నటిస్తోంది.

ప్రశ్నించకుండా సైలెంట్‌‌గా

ప్రశ్నించకుండా సైలెంట్‌‌గా

చదువుకున్న వారు ప్రశ్నించకుండా సైలెంట్ గా ఉండడం వల్లే రాజకీయాలు ఇలా తయారయ్యాయనే పాయింట్ తో దర్శకుడు సెల్వరాఘవన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఎన్జీకే తర్వాత సూర్య మరో భారీ చిత్రంతో వస్తున్నాడు. కెవి ఆనంద్ దర్శకత్వంలో సూర్య కప్పాన్ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సూర్య మారు వేషంలో ఉంటూ ఉగ్రవాదుల పనిపట్టే అధికారి పాత్రలో నటిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X