ఇంతలా తెరిచి పెడితే ఎలా అమ్మడు!!.. బిగ్‌బాస్ బ్యూటీ అందాలకు నెటిజన్స్ ఫిదా
కోలీవుడ్ ప్రేక్షకులకు సాక్షి అగర్వాల్, ఆమె అందచందాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. బిగ్ బాస్ తమిళ్ మూడో సీజన్‌లో పాల్గొని ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. లాస్లియ, సాక్షి, కొట్లాట, కెవిన్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఇలా ప్రతీ విషయంలో సాక్షి హైలెట్ అయింది. బిగ్ బాస్ హౌస్‌లో గ్లామర్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారిన సాక్షి మధ్యలో ఆటలోంచి బయటకు వచ్చేసింది. బయటకు వచ్చాక సాక్షి రెట్టింపు వేగంతో దూసుకుపోయింది.

సోషల్ మీడియాలో రచ్చ..
బిగ్ బాస్ కంటే ముందు సాక్షి చాలానే చిత్రాలు చేసింది. సూపర్ స్టార్ రజినీ కాలా సినిమాలోనూ నటించింది. అయితే సినిమాల కంటే బిగ్ బాస్ షోనే సాక్షికి ఎక్కువగా ఫాలోయింగ్‌ను తీసుకొచ్చింది. అందుకే షో నుంచి బయటకు వచ్చాక సాక్షి సోషల్ మీడియాలో బిజీ అయింది. నిత్యం వ్యాయామం అంటూ ఫిట్‌నెస్ గురించి ఎన్నో సూచనలు ఇస్తూ ఉంటుంది.

గతం గురించి..
చిన్నప్పుడు తన గురించి, తన ఆహార్యం గురించి ఎంతమంది ఎన్ని రకాలుగా కామెంట్ చేసేవారో ఆ మధ్య చెప్పుకొచ్చింది సాక్షి. చిన్నతనంలో అందవికారంగా ఉందని తోటీ స్నేహితులు ఎంతోహేళన చేసేవారట. మొద్దుగా ఉంది, చబ్బీగా ఉంది, లావు అంటూ ఏవేవో కొత్త పేర్లు పెట్టి పిలిచే వారని తెలిసిందే. అయితే వారిని తాను ఏమీ అనదల్చుకోలేదని, ఎందుకంటే వారు అలా అనడం వల్లే తాను ఈ రోజు ఈస్థాయిలో ఉన్నానని చెప్పుకొచ్చింది.

వారిని బాధపడనివ్వండి..
తాజాగా సాక్షి కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ.. డియర్ చాంపియన్స్.. నిజంగా కష్టపడండి.. శిల్పిలా మారి మీ బాడీని చెక్కుకోండి.. మీ చర్మాన్ని ముద్దుగా చూసుకోండి.. ఆరోగ్యకమైన భోజనం చేయండి.. ధృడంగా ఉండండి.. మీ కలల కోసం పని చేయండి.. ఏదో ఒక రోజు మీ పేరు మార్మోగిపోతుంది.. మీరు ఓడిపోతే చూడాలనుకునే వారిని మీ విజయంతో బాధపడనివ్వండి అని చెప్పుకొచ్చింది.
Recommended Video

హాట్ ఫోటో షూట్‌లతో రచ్చ..
సాక్షి అగర్వాల్ నిత్యం ఏదో ఒక ఫోటో షూట్ నిర్వహిస్తూనే ఉంటుంది. తాజాగా అలాంటి కొన్ని హాట్ ఫోటోలను షేర్ చేస్తూ.. నన్ను ద్వేషించే వారి గురించి పెద్దగా పట్టించుకోను. వారు అబద్దపు జీవితాల్లో బతుకుతూ దాన్నే నిజమని బతుకుతారు.. వారికి వ్యతిరేకంగా నేను మాట్లాడితే కోపంలో అలా ద్వేషిస్తారు. పైగా నేను ఒకరితో పోల్చుకోను.. నాకంటూ ఓ ప్రత్యేకత ఉందని నాకు తెలుసు అని పేర్కొంది. ఇక సాక్షి తన అందాలను అలా తెర పెట్టే సరికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం సాక్షి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











