వికృతంగా ఉందని స్కూల్లో అందరూ ఏడిపించేవారట.. బిగ్‌బాస్ హాట్ బ్యూటీ ఒక్కప్పటి షాకింగ్ పిక్

బిగ్‌బాస్ హాట్ బ్యూటీ సాక్షి అగర్వాల్ తమిళ నాట బాగానే ఫేమస్. సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ చేసే సాక్షి అగర్వాల్.. బిగ్ బాస్ మూడో సీజన్‌తో ఒక్కసారిగా క్రేజీగా మారింది. హాట్ హాట్ అందాలతో హౌస్‌లో గ్లామర్‌ను ఒలకబోసింది. మోడల్‌గా కెరీర్‌ను మొదలు పెట్టి తమిళ స్టార్స్ సినిమాల్లో పాత్రలను చేసే స్థాయికి ఎదిగింది. అయితే ఇదంతా ఓ వైపు అనుకుంటే.. సోషల్ మీడియాలో ఈ అమ్మడు చేసే రచ్చ అంతా ఇంతా కాదు. తాజాగా తన పాత ఫోటో ఒకటి షేర్ చేసి అందర్నీ షాక్‌కు గురి చేసింది. ఆ ఫోటో వెనకున్న గతాన్ని, ప్రస్తుతం ఆమె అంత ఫిట్‌గా ఉండటానికి గల కారణాన్ని వివరించింది. ఆ సంగతేంటో ఓ సారి చూద్దాం.

ఏడిపించేవారు..

ఏడిపించేవారు..

ఆ ఫోటోను చూసి ఎంత మంది నమ్మారు అది నేనే అని.. అవును అది నేను. ఆ రెండింట్లో ఉన్నది నేనే. ఫేస్‌లో ఉన్న ఆ కొవ్వును తగ్గించుకోవడమే అతిపెద్ద సవాల్‌గా మారింది. స్కూల్‌లో నా క్లాస్ మేట్స్, సీనియర్స్ నన్నె ఎంతో ఏడిపించేవారు. ప్రెట్టీ గర్ల్, బురద మొహం, పుస్తకాల పురుగు, గుండ్రటి గుమ్మడి పండు అని ఇలా ఇష్టమొచ్చినట్టుగా పిలిచి ఏడిపించేవారు.

చదువు మీదే ధ్యాస..

చదువు మీదే ధ్యాస..

అయితే వారినేమీ మీరు తిట్టుకోకండి. నిజానికి వారికే నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. కానీ నాకు ఆ సమయంలో చదువు మీద తప్ప మిగతా వేటిమీదా ధ్యాస లేదు. నా చదువుల్లో ఎప్పుడూ నేను ఫస్ట్ వచ్చే దాన్ని. పైగా నా మొద్దుగా ఉండే నా రూపమంటే నాకు ఎంతోఇష్టం. నాకు ఇప్పుడున్న రూపం కూడా ఇష్టమే. ఇప్పటికీ ముద్దుగానే ఉన్నాను. ఇలా మారాలని నాకు నేను, నాకోసం నేను అనుకున్నాను.

సర్జరీల జోలికి..

సర్జరీల జోలికి..

అయితే కొవ్వును కరిగించుకునేందుకు నేను ఎప్పుడూ కడుపు మాడ్చుకోలేదు. కత్తులతో కోసే సర్జరీలను ఆశ్రయించలేదు. కృత్రిమ పద్దతులను ఎంచుకోలేదు. అందుకే చాలా ఏళ్లు పట్టింది. కానీ ప్రతీ దశలో కలిగిన నొప్పి మాత్రం చాలా ఎక్కువ. అయితే ఆ బాధకు ఇప్పుడున్న రూపం కోసం సరైనదే అని అనిపిస్తుంది. అది నాకు ఎంతో నేర్పింది.

ఎంతో ఎత్తుకు..

ఎంతో ఎత్తుకు..

నేను లావుగా ఉన్న రోజులు చాలా ఉన్నాయి. ఎన్నో వర్కౌట్లు చేస్తూ ఉంటాను. అయితే ఇప్పటికీ నా అంత: సౌందర్యం, బాహ్య సౌందర్యం నాకు ఇష్టమే. వీటన్నంటి కంటే విల్ పవర్, హార్డ్ వర్క్, నిలకడ, అంతులేని అంకితభావం ఉంటే జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదగవచ్చు. కష్టమైన పని మీద ఫోకస్ చేస్తే.. చాలు ఈ విశ్వమే నిన్ను ఎక్కడికి చేర్చాలో అక్కడి చేర్చుతుంది.

సరైన చోట ఉన్నాను..

సరైన చోట ఉన్నాను..

ప్రస్తుతానికి నేను సరైన చోటే ఉన్నాను. నా పాత ఫోటోలను పోస్ట్ చేయడంపై ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాను. కొన్నేళ్ల క్రితం అలా నేను చేయలేకపోయాను. ఆ విధి నన్ను ఇంకా సరైన స్థానంలో నిలబెడుతుందని నాకు నమ్మకం ఉంది.

నీ కోసం చేసుకో..

నీ కోసం చేసుకో..


అది స్కూల్, కాలేజి అని గుర్తు పెట్టుకోండి.. జనాలు అలానే ఏడిపిస్తారు.. ఆ విషయం నన్ను బాధపెట్టింది. అయితే జనాలు తిట్టడం లేదా ట్రోలింగ్ చేయడం వంటి చేస్తారు.. మనం ఓ గొప్ప స్థానాన్ని చేరుకున్నాక వాటిని పట్టించుకోకూడదు. మన దళపతి కూడా అదే చెప్పాడు. కదా. ఏం చేసినా నీ కోసం చేసుకో'అని చెప్పుకొచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X