మణిరత్నం నాకన్నా గొప్పోడా?
ప్రముఖ దర్శకుడు మణిరత్నం తీసే సినిమాలు మరీ పూర్వ కాలం కథలు,రెండువేల సంవత్సరాలనాటి పాయింట్స్ తో వస్తాయి..అవి అంత గొప్పవా..అని మరో తమిళ దర్శక, నిర్మాత శక్తి చిదంబరం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దానికి కారణం ఆయన ఈ మధ్య తీసిన రాజాదిరాజా సినిమాను మణిరత్నం భార్య సుహాసిని కామెంట్ చేయటమే. లారెన్స్ కథానాయకుడుగా ఇటీవల తమిళ, తెలుగు భాషల్లో విడుదలైన 'రాజాధి రాజా' సినిమాను 'బ్యాడ్ టేస్ట్' తో తీశారంటూ సుహాసిని వ్యాఖ్యానించింది.
సుహానిసి తమిళంలో ఓ ఛానల్ కోసం 'హాసిని పేసుమ్ పడమ్' అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కొత్తగా విడుదలైన సినిమాల రివ్యూలు నిర్మొహమాటంగా ఆమె ఈ పోగ్రామ్ లో విశ్లేషిస్తుంటుంది. ఇందులో భాగంగానే 'రాజాధి రాజా' గురించి సుహాసిని వ్యాఖ్యానిస్తూ, ఎమ్జీఆర్, రజనీ, విజయ్ చిత్రాల ఫార్ములాలో ఈ సినిమా ఉందనీ, తమిళ సినిమాను ఇరవై ఏళ్లు వెనక్కి నెట్టిందనీ అన్నారు. దీంతో దర్శకుడు శక్తిచిదంబరం భగ్గుమంటున్నారు.
తన సినిమాతో తమిళ ఇండస్ట్రీ 20 ఏళ్ల వెనక్కి వెళితే సుహాసిని భర్త మణిరత్నం తీస్తున్న 'రావణ' 2000 ఏళ్ల క్రితం నాటిది కాదా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. మణిరత్నం గత సినిమాలు కూడా కర్ణ, సావిత్రి-సత్యవంతుడు వంటి చారిత్రక కథా వస్తువుల ఆధారంగా తీసినవేనని అంటున్నారు. సుహాసినిపై నిర్మాతల మండలికి ఫిర్యాదు చేయడంతో పాటు న్యాయపోరాటం చేసేందుకు కూడా ఆయన ప్రస్తుతం సిద్ధపడుతున్నారు.ఈ గొడలోకి మణిరత్నాన్ని లాగటం మాత్రం చాలామందికి మాత్రం నచ్చటం లేదు.


Click it and Unblock the Notifications











