మరో హిట్టు కొట్టేందుకు రెడీ.. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌తో హీరో
అభిమన్యుడు సినిమాతో అందరి దృష్టి ఆకర్శించాడు దర్శకుడు పీ ఎస్ మిత్రన్. మంచి కథాకథనాలతో కట్టిపడేసిన అభిమన్యుడు విశాల్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. సోషల్ మీడియా వాడకం, టెక్నాలజీ లాంటివి మానవాళికి ఎంత ప్రమాదాన్ని సృష్టిస్తున్నాయో చక్కగా చూపించాడు.

శివ కార్తికేయన్ హీరోగా..
మళ్లీ అలాంటి ఓ సందేశాన్ని ఇస్తూ.. శివ కార్తికేయన్‌ను హీరోగా చూపిస్తున్నాడు. తమిళ నాట యువ హీరోల్లో ఫుల్ స్పీడుగా దూసుకుపోతున్న శివ కార్తికేయన్.. హీరోగా మన ముందుకు వచ్చేస్తున్నాడు. తనదైన స్టైల్ నటనతో అందర్నీ మెప్పిస్తూ.. నిర్మాతగానూ మంచి విజయాన్ని అందుకున్నాడు.
సల్మాన్ చేతుల మీదుగా..
కార్పోరేట్ విద్యాసంస్థల స్కామ్‌లు, ఒత్తిడితో విద్యార్థుల ఆత్మహత్యలు వంటి కథా నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ టీజర్‌ను నేడు విడుదల చేశారు. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ చేతుల మీదుగా ఈ టీజర్ విడుదల చేయడంతో అందరి చూపు పడింది. వాటే స్టైలీష్ టీజర్.. టీజర్‌ను లాంచ్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది.. చిత్రబృందానికి ఆల్ ది బెస్ట్ అని ట్వీట్ చేశాడు.

ప్రత్యేక పాత్రలో అర్జున్...
యాక్షన్ కింగ్ అర్జున్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతోన్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో వచ్చిన అభిమన్యుడు సినిమాలో మంచి పవర్‌ఫుల్ రోల్‌ను పోషించిన సంగతి తెలిసిందే. మరోసారి తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించబోతోన్నట్లు కనిపిస్తోంది. ఈ మూవీలో అభినయ్ డియోల్, కళ్యాణీ ప్రియదర్శన్‌లు నటిస్తోండగా.. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్రం డిసెంబర్‌లో విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











