సల్మాన్ ఖాన్ మరో రీమేక్ ఓకే చేసాడు
వరసగా రీమేక్ లు చేసుకుంటూ బాలీవుడ్ లో రీమేక్ ల సీజన్ తీసుకువచ్చన ఘనత సల్మాన్ ఖాన్ దే. తాజాగా ఆయన మరో రీమేక్ ని ఓకే చేసినట్లు సమాచారం. తమిళంలో సూపర్ హిట్టైన వేట్టై చిత్రాన్ని హిందీలో చేయటానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ చిత్రం విడుదలకు ముందే ఆయన యుటివీ ధనుంజయన్ ద్వారా చూసారు. తర్వాత తమిళంలో టాక్ కూడా బాగా రావటంతో సినిమాని హిందీకి చేయటానికి ఓకే అనేసారు. తమిళంలో మాధవన్ చేసిన పాత్రను సల్మాన్ ఖాన్ చేస్తూండగా, ఆర్య చేసిన పాత్రను రణబీర్ చెయ్యనున్నాడు. ఇద్దరు అన్నదమ్ములతో నడిచే యాక్షన్ చిత్రం ఇది.
పొంగల్ కి తమిళనాట రిలీజైన ఈ చిత్రం డివైడ్ టాక్ తెచ్చుకున్నా కలెక్షన్స్ లో మాత్రం అదరకొడుతోంది. ఇక ఇప్పటికే సల్మాన్ పోకిరీ,రెడీ,బాడీగార్డ్ చిత్రాలు హిందీలో చేసేసారు. త్వరలో రవితేజ కిక్ రీమేక్ చెయ్యనున్నారు. దూకుడు కూడా చేస్తారేమో అనుకున్నారు కానీ సల్మాన్ పెద్దగా ఆసక్తి చూపలేదు. కేవలం వినోదం కలగలిపిన యాక్షన్ చిత్రాలను మాత్రమే సల్మాన్ ఓకే చేస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం ప్రకటన అధికారికంగా వెలవడనుంది.


Click it and Unblock the Notifications











