ఐటం గర్ల్ గా మారిన రాజమౌళి హీరోయిన్..?
బాలకృష్ణ-అధినాయకుడు, వెంకటేష్ - బాడీగార్డ్ చిత్రాల్లో ప్రధాన పత్రాలు కొట్టేసిన సలోని కి మరో ఆఫర్ వచ్చిపడింది. ఈ బ్యూటీ విక్రమ్ హీరోగా నటిస్తోన్న తమిళ చిత్రం 'రాజపట్టై" లోని ఒక ఐటెం సాంగ్ లో విక్రమ్ తో కలసి డ్యాన్సులు వేయనుంది. టాలీవుడ్ ది గ్రేట్ దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో మర్యాద రామన్నలో సునీల్ సరసన సలోని హీరోయిన్ గాను, మగధీరలో ఒక పాత్రలో నటించింది. రాజాపట్టై చిత్రానికి సంబందించిన పాట చెన్నై లోని ఎవియం స్టూడియోలో చిత్రీకరణ జరుగుతోంది. డ్యాన్స్ మాస్టర్ శోభి ఈ పాటను హాట్ హాట్ గా చిత్రీకరిస్తున్నారు.
'నా పేరు శివ" చిత్రానికి దర్శకత్వం వహించిన సుసీన్ తిరన్ ఈ చిత్రాన్నీ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ ఐటెం నంబర్ లో చేసేందుకు కొన్నివారాల క్రితం హన్సిక నో చెప్పిన సంగతి తెలిసిందే. అనంతరం సేన్ కోరిక మేరకు శ్రియ, రీమాసేన్ ఈ సాంగ్ లో నటించేందుకు అంగీకరించారు. తాజాగా వీరితో పాటు సలోనీ కూడా జతకట్టింది. దీక్ష సేథ్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. విక్రమ్ సెలబ్రిటీ జిమ్ ట్రైనర్ గా స్పోర్టివ్ పాత్రలో కనిపించ బోతున్నారు. ఈ చిత్రాన్ని ఏకకాలంలో తమిళ, తెలుగు భాషల్లో నిర్మిస్తున్నారు. డిసెంబర్ లో ఈ మూవీ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











