'ఎటో వెళ్లి పోయింది మనస్సు' గురించి సమంత
''నా అభిమాన దర్శకుడు రూపొందిస్తున్న 'ఎటో వెళ్లి పోయింది మనస్సు' చిత్రంలో హీరోయిన్‌గా నటించటమనేది ఈ సంవత్సరంలో నాకు వచ్చిన అపురూపమైన అవకాశంగా భావిస్తున్నా.. ఆ సినిమాలో కాలేజీ అమ్మాయిగా నటిస్తున్నా. ఒక అబ్బాయి, అమ్మాయిల నడుమ చోటు చేసుకున్న సంఘటన సమాహారంగా ఈ చిత్రం నిర్మితమవుతోంది. ఈ పాత్ర నా జీవితానికి చాలా దగ్గరగా ఉంటుంది. అంతేకాక మూడు భాషల్లో హీరోయిన్‌గా నేనే నటిస్తున్నా. తమిళంలో జీవా, తెలుగులో నాని అలాగే హిందీలో రాయ్ కపూర్‌కు జంటగా తెరపై కనిపిస్తాను'' అని సమంత వివరించింది.
అలాగే నేను దక్షిణాది నుంచి వచ్చాను. బాలీవుడ్‌లో అవకాశాల కోసం పరుగులు తీయటంలేదు. 'ఎటో వెళ్లి పోయింది మనస్సు' హిందీ వెర్షన్‌లో నటిస్తావా అని గౌతమ్ నన్ను అడిగారు. నేను ఓకే చెప్పాను'' అని సమంత చెప్పింది. ప్రస్తుతం సమంత తెలుగులో 'ఈగ', 'ఆటోనగర్ సూర్య', 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రాలతో పాటుగా గౌతమ్ మీనన్ తెలుగు, తమిళ, భాషల్లో ఏకకాలంలో నిర్మిస్తున్న చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. వీటితో పాటుగా మణిరత్నం దర్శకత్వంలో తమిళ చిత్రం 'కడల్', తెలుగులో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'ఎవడో' చిత్రంతో పాటుగా పేరు పెట్టని మరో తెలుగు చిత్రాలకు సంతకం చేసింది.


Click it and Unblock the Notifications











