ఎన్టీఆర్‌, మహేష్‌ లతో చేసాకే...: సమంత

By Srikanya

"ఇది వరకు డాన్స్‌ విషయంలో చాలా గందగోళంగా ఉండేది. ఎన్టీఆర్‌, మహేష్‌బాబులాంటి హీరోలతో స్టెప్పులు వేసిన తరవాత వాటిపై అవగాహన వచ్చింది. డాన్స్ లపై మరింత దృష్టి పెడుతున్నా. మేం ఎంత చేసినా హీరోల వేగం ముందు తేలిపోవలసిందే" అంటోంది సమంత. అనారోగ్యం నుంచి కోలుకున్న ఆమె కంటిన్యూగా షూటింగ్ లలో పాల్గొంటోంది. ఆమె త్వరలోనే నాగచైతన్యతో కలిసి 'ఆటోనగర్‌ సూర్య'షూటింగ్ లో జాయిన్ అవుతోంది.

"అలాగే ...సినిమా అంటే ఏమీ తెలియని స్థితిలో ఈ రంగంలో అడుగుపెట్టాను. ఇప్పుడంతా తెలుసు.. అని చెప్పను. ప్రాథమిక విషయాలపై అవగాహన పెంచుకొంటున్నాను. నా దగ్గరకు వచ్చే ప్రతి దర్శకుడూ నన్ను కొత్తగా ఆవిష్కరించే ప్రయత్నం చేయడం నా అదృష్టం. ఫలానా సినిమాలో సమంత బాగా చేసిందీ... అని ఎవరైనా అంటే ఆ ప్రశంస నా దర్శకుల వల్లే దక్కిందని భావిస్తాను. వాళ్లు ఏం చెబితే అది చేస్తున్నాను. ఏ రంగంలో అయినా ఒక్క రోజులోనే అంతా సాధించలేం. నిరంతర విద్యార్థిలా ఉండడమే నాకిష్టం. మంచి విషయం ఎవరు చెప్పినా స్వీకరిస్తాను" అంది.

ఇక మణిరత్నం 'కాదల్‌'సినిమా నుంచి వైదొగలటం గురించి మాట్లాడుతూ..."గత కొన్ని నెలలుగా రెస్ట్ లేకుండా కంటిన్యూగా షూటింగ్స్ చేస్తున్నాను. దానివల్ల ఆ మధ్య అస్వస్థతకు గురయ్యాను. దాంతో నా షూటింగ్ షెడ్యూల్స్ కొంచెం అటూ ఇటూ అయ్యాయి. అందువల్ల మణి సార్ సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అది నా దురదృష్టం. మణి సార్ దర్శకత్వంలో షూటింగ్‌కి వెళ్లకుండానే వదులుకోవాల్సి వచ్చింది" అని క్లారిఫై చేసింది.

"అలాగే 'ఈగ' చిత్రం విజయం సాధిస్తుందని మాకు మొదట్నుంచీ నమ్మకం ఉంది. ఈ చిత్రంలో ఒక భాగం కావడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. నాని, సుదీప్ లేకుండా ఈ సినిమాని ఊహించలేకపోతున్నా. సుదీప్ గురించి చెప్పడానికి మాటలు రావడంలేదు. తన నటన అద్భుతం" అని చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం సమంత చిత్రాలు వరుసగా రెడీ అవుతున్నాయి. నాగచైతన్య' ఆటోనగర్‌ సూర్య' ' రామ్‌ చరణ్‌ ' ఎవడు' గౌతమ్‌ మీనన్‌ ' ఎటు వెళ్లిపోయిందో మనసు' త్వరలో విడుదల కానున్నాయి. నిర్మాతలకు ఆమె మీద పెట్టుబడి పెడితే లాభాలకు ఇబ్బంది ఉండదనే నమ్మకం ఆమెను తమిళ,తెలుగు భాషల్లో బిజీ చేస్తోంది. ప్రస్తుతం ఆమె మహేష్ సరనస చేస్తున్న సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు,సిద్దార్ద సరసన నందినీ రెడ్డి దర్శకత్వం షూటింగ్ లోనూ రెగ్యులర్ గా పాల్గొంటోంది. అడపా దడపా ఆమె యాడ్ ఫిల్మ్ లు కూడా చేస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X