మా నాన్న తెలుగువాడు అందుకే...:సమంత
మా నాన్న తెలుగువారు. అమ్మ మలయాళీ, నేను చెన్నైలో పుట్టి పెరిగాను. ఇలా అన్ని ప్రాంతాలతోనూ నాకు అనుబంధం ఉంది. ఆ ప్రభావంతోనేమో అన్నిచోట్లా కలిసిపోతున్నాను. సులభంగా నటించేస్తున్నాను అంటోంది సమంత. ఆమె ఒకేసారి మూడు భాషల చిత్రాల్లో నటిస్తోంది. మరి అలా మూడు రకాలుగా నటించడం ఇబ్బందికాదా? అంటూ మీడియా వారు అడిగితే ఆమె ఇలా స్పందించింది. అలాగే... ప్రస్తుతం నా సినిమా జీవితం కీలకమైన దశలో ఉంది. ఏం నేర్చుకొన్నా ఇప్పుడే... అన్నట్టుగా కష్టపడుతున్నా'' అంటోంది. గౌతమ్‌మీనన్ సినిమా గురించి చెబుతూ...ఆయన సినిమాలో రెండోసారి నటిస్తుండడం, అదీ మూడు భాషల్లో ఒకేసారి తెరకెక్కుతుండడం ఎంతో ఆనందాన్నిస్తోంది అంది. గౌతమ్ మీనన్ దర్సకత్వంలో రూపొందుతున్న చిత్రానికి ఎటో వెళ్లిపోయింది మనస్సు అనే టైటిల్ పెట్టారు. ఆ చిత్రం ప్రోమోలు ఈ మధ్యనే విడుదలై మంచి పేరు తెచ్చుకున్నాయి. అలాగే రాజమౌళి దర్సకత్వంలో రూపొందుతున్న ఈగ చిత్రం కూడా త్వరలో విడుదల కానుంది. రామ్ చరణ్ సరసన ఆమె వంశీ పైడిపల్లి చిత్రంలో చేస్తోంది. అలాగే మహేష్ సరసన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, నందినీ రెడ్డి దర్శకత్వంలో సిద్దార్ద సరసన సమంత చేస్తూ బిజీగా ఉంది. మరో ప్రక్క నాగచైతన్య సరసన ఆమె చేస్తున్న ఆటోనగర్ సూర్య చిత్రం షూటింగ్ జరుగుతోంది.


Click it and Unblock the Notifications











