twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సమంతను చీట్ చేశారు... తమిళ పోరాటాన్ని కించపరిచారు.. భగ్గుమన్న సీనియర్ నటుడు

    |

    అందం, అభినయంతో ఆకట్టుకొంటున్న సమంత అక్కినేని తాజాగా ది ఫ్యామిలీ మ్యాన్ 2 చిత్రంతో వెబ్ సిరీస్‌ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ఈ చిత్రంలోని రాజీ పాత్ర తన కెరీర్‌లో బెస్ట్ అంటూ పలువురు ప్రశంసలు గుప్పిస్తున్నారు. అయితే తమిళ టెర్రిరిస్టుగా రాజీ పాత్ర తమిళ ఈలం ఉద్యమాన్ని కించపరిచే విధంగా ఉందని తమిళ సినీ పరిశ్రమలో కొందరు విమర్శలు చేస్తున్నారు. ఈ వివాదంలోకి వెళితే..

    తమిళ ప్రజల మనోభావాలను కించపరిచే విధంగా

    తమిళ ప్రజల మనోభావాలను కించపరిచే విధంగా

    ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ విడుదలకు ముందు వచ్చిన ట్రైలర్‌ తమిళనాడులో ప్రకంపనలు సృష్టించింది. ట్రైలర్‌లోని కొన్ని సన్నివేశాలు తమిళుల ఆత్మ గౌరవ పోరాటాన్ని కించపరిచే విధంగా ఉంది. తమిళ ప్రజల మనోభావాలను భంగం కలిగించే విధంగా ఉంది అంటూ తమిళ నేతలు, వివిధ సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి.

    సమంతను తప్పుదోవ పట్టించారని

    సమంతను తప్పుదోవ పట్టించారని

    అయితే సమంత పోషించిన రాజీ పాత్రపై సీనియర్ నటుడు మనోబాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఈ పాత్రలో నటించిన ఆమె భేషరుతగా క్షమాపణలు చెప్పాలి. తమిళ తీవ్రవాది అని చెప్పి దర్శక నిర్మాతలు సమంతను చీట్ చేసి ఉంటారు. కానీ ఆమె పాత్ర తమిళ ఈలం పోరాటాన్ని కించపరిచే విధంగా ఉంది అంటూ మనోబాలా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

    ఎల్‌టీటీఈ గురించి రాయాలంటే

    ఎల్‌టీటీఈ గురించి రాయాలంటే

    ది ఫ్యామిలీ మ్యాన్ దర్శక, నిర్మాతలు రాజ్ అండ్ డీకేపై మనోబాలా నిప్పులు చెరిగారు. ఎల్‌టీటీఈ గురించి రాయాలంటే ఓ అర్హత ఉండాలి. వాస్తవాలను వక్రీకరించే విధంగా ఉన్న పాత్రను అంగీకరించే ముందు ఆమె తటపటాయించి ఉంటారని అనుకొంటున్నాను. తమిళుల మనోభావాలను దెబ్బ తీసిన దర్శక, నిర్మాతలు క్షమాపణ చెప్పాలి అని మనోబాలా డిమాండ్ చేశారు.

    సమంత క్షమాపణ చెప్పాలి...

    సమంత క్షమాపణ చెప్పాలి...

    తమిళ ప్రజల మనోభావాలను పరిరక్షించేందుకు ఎలాంటి పోరాటానికైనా సిద్దం. ది ఫ్యామిలీ మ్యాన్‌ మూవీలో అవాస్తవాలను చిత్రీకరించినందున అందుకు బాధ్యత వహించాల్సిందే అని మనో పేర్కొన్నాు. ఒకవేళ సమంత క్షమాపణ చెబితే అందుకు దర్శకులు బాధ్యత తీసుకోవాలి. అప్పటి వరకు వెబ్ సిరీస్‌కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు కొనసాగుతాయి అని మనోబాలా హెచ్చరించారు.

    English summary
    Samantha Akkineni's latest web series The Family Man 2 under fire of Tamils. Actor Mano Bala demands apology from Directors Raj and DK and Samantha for degardation of Tamil Ealam War.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X